
Anasuya Bharadwaj : జీవితం అంటే కెరీర్, సంపాదనే కాదు… ఆస్వాదించడం కూడా. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది అనసూయ. షూటింగ్స్, మీటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తుంది. భర్త, పిల్లలతో విహారాలు చేస్తుంది. ఫ్యామిలీ కంటే ఏదీ ముఖ్యం కాదని ఆమె భావన కావచ్చు. తాజాగా అనసూయ ఒక అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు. అడవిలో బైక్ రైడింగ్ చేశారు. అనసూయ, భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కొడుకులు తలో సైకిల్ తీసుకొని అడవిలో చక్కర్లు కొట్టారు. అక్కడున్న జంతువులను కెమెరాలో బంధించారు.
తమ జంగిల్ అడ్వెంచరస్ టూర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. అనసూయ పొట్టి లాగులో సైకిల్ తొక్కుతూ చేసిన సాహసకృత్యాలపై నెటిజెన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. అనసూయ భర్త సుశాంక్ కూడా ఇలాంటి సాహసోపేత టూర్స్ ఇష్టపడతారు. ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ మీద సుదూర ప్రాంతాలకు టూర్స్ కి వెళ్లారు.
సుశాంక్-అనసూయలది ప్రేమ వివాహం. స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడిన ఈ జంట ఏళ్ళ తరబడి ప్రేమించుకున్నారు. సుశాంక్ తో పెళ్ళికి అనసూయ పేరెంట్స్ ఒప్పుకోలేదు. దాంటో ఇంట్లో నుండి బయటకు వచ్చేసి హాస్టల్ లో మకాం పెట్టింది. అయితే పేరెంట్స్ అంగీకారం చెప్పే వరకు వీరు వివాహం చేసుకోలేదు. అనసూయ-సుశాంక్ లకు ఇద్దరు అబ్బాయిలు. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ అనసూయ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.
జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చిన అనసూయ స్టార్ గా ఎదిగారు. ఆ షో తెచ్చిపెట్టిన ఇమేజ్ ఆమెను నటిగా నిలబెట్టింది. ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా కొనసాగుతున్నారు. ఆమె వెండితెర జర్నీ సైతం సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. క్రేజీ ఆఫర్స్ ఆమెను వరిస్తున్నాయి. అనసూయ కీలక రోల్ చేసిన రంగమార్తాండ చిత్రం ఉగాది కానుకగా విడుదల కానుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రంగమార్తాండ మూవీలో అనసూయ ప్రకాష్ రాజ్ కూతురిగా కనిపించనున్నారు. అలాగే పుష్ప 2 మూవీలో అనసూయ నటిస్తున్నారు.