
Varalakshmi Sarathkumar : తమిళ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో బాగా బిజీ అయ్యారు. ఓ తరహా క్యారెక్టర్స్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఆడ విలన్ అంటే ఆమెనే గుర్తుకు వస్తున్నారు. నెగిటివ్ రోల్స్ కోసం మేకర్స్ ఆమె వెనుకబడుతున్నారు. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ మూవీతో వరలక్ష్మి తెలుగులో అడుగుపెట్టారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఆ కామెడీ ఎంటర్టైనర్ లో ఆమె నెగిటివ్ రోల్ చేశారు. క్రాక్ ఆమెకు భారీ ఫేమ్ తెచ్చింది. విలన్ కీప్ జయమ్మ పాత్రలో విలనిజం ఇరగదీసింది.

ఇక సమంత లేటెస్ట్ సూపర్ హిట్ యశోద చిత్రంలో సైతం వరలక్ష్మి విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సూపర్ హిట్ వీరసింహారెడ్డి మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. వీరసింహారెడ్డిలో వరలక్ష్మి బాలకృష్ణ చెల్లెలు పాత్ర చేయడం విశేషం. బాలయ్యతో పోటీపడి నటించిన వరలక్ష్మి ఆయనకు గట్టి పోటీ ఇచ్చింది. సొంత అన్న మీద పగబట్టిన చెల్లి పాత్రలో ఒదిగిపోయి నటించింది.
వరలక్ష్మి అంటే కరుడుగట్టిన విలన్ పాత్రలకు ప్రత్యేకం అన్నట్లు ఆమె తయారయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అరడజను సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయిన వరలక్ష్మి, విలన్ గా సెటిల్ అయ్యారు. ఆమె లాంగ్ కెరీర్ అనుభవించడం ఖాయంగా కనిపిస్తుంది. తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. వరలక్ష్మి ఉందంటే సినిమాకు ప్లస్ అన్న అభిప్రాయం మేకర్స్ లో ఉంది.

వరలక్ష్మి ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ హనుమాన్. దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ లో తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో కూడా విజువల్స్ అదిరిపోయాయని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న హనుమాన్ మూవీలో వరలక్ష్మి రోల్ ఏమిటనేది ఆసక్తికరం.
నటుడు శరత్ కుమార్ వారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టిన వరలక్ష్మి చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు రాబట్టారు. నటిగా అలరిస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఆమె చేసే పాత్రల రీత్యా అందాలు ఆరబోసే అవకాశం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ పని చేస్తున్నారు. ఈ మధ్య సన్నబడిన వరలక్ష్మి తన స్లిమ్ ఫిగర్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తున్నారు.