Trivikram: త్రివిక్రమ్ కి లైఫ్ ఇచ్చిన స్వయంవరం మూవీ గురించి ఈ 5 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

వేణుతో సినిమా చేయాలని నిర్మాత వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్ణయించుకున్నారట. కొత్త హీరో కావడంతో తక్కువ బడ్జెట్ తో పూర్తి అయ్యే కథ కావాలి. శ్యామ్ ప్రసాద్ కొన్ని కథలు విన్నారట.

Written By: S Reddy, Updated On : April 24, 2024 11:34 am

5 interesting things about Swayamvaram movie

Follow us on

Trivikram: వేణు తొట్టెంపూడి-లయ జంటగా నటించిన చిత్రం స్వయంవరం. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు అవుతుంది. 1999 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీ త్రివిక్రమ్ కి లైఫ్ ఇచ్చింది. రచయితగా గుర్తింపు తెచ్చింది. మరి స్వయంవరం మూవీ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. వేణు తొట్టెంపూడి కి ఇది డెబ్యూ మూవీ. అలాగే లయకు కూడా హీరోయిన్ గా మొదటి చిత్రం.

వేణుతో సినిమా చేయాలని నిర్మాత వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్ణయించుకున్నారట. కొత్త హీరో కావడంతో తక్కువ బడ్జెట్ తో పూర్తి అయ్యే కథ కావాలి. శ్యామ్ ప్రసాద్ కొన్ని కథలు విన్నారట. కానీ అవి పరిమిత బడ్జెట్ లో అయ్యేలా లేవట. అప్పుడు నూతన రచయిత త్రివిక్రమ్ రెండు కథలు వెంకట శ్యామ్ ప్రసాద్ కి చెప్పారట. అందులో ఒకటి స్వయంవరం. ఈ కథను ఎంచుకున్న శ్యామ్ ప్రసాద్ త్రివిక్రమ్ నే దర్శకత్వం వహించమని అన్నారట.

అప్పటికి దర్శకుడిగా త్రివిక్రమ్ కి ఎలాంటి అనుభవం లేదట. దాంతో రిజెక్ట్ చేశాడట. అప్పుడు కే విజయ భాస్కర్ ని తెరపైకి తెచ్చారు. విజయ భాస్కర్ 1991లో ప్రార్థన టైటిల్ తో ఒక చిత్రం చేశారు. అది డిజాస్టర్. ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత విజయభాస్కర్ మరలా స్వయంవరం మూవీతో దర్శకుడు అయ్యాడు. చెప్పాలంటే విజయభాస్కర్, త్రివిక్రమ్ లకు స్వయంవరం లైఫ్ ఇచ్చింది.

ఇక సంగీత దర్శకుడిగా వందేమాతరం శ్రీనివాస్ ని తీసుకున్నారు. ఇది కూడా ప్రయోగమే. ఆయన విప్లవ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తారు. ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకోవడం సాహసమే. కానీ వందేమాతరం శ్రీనివాస్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. కీరవాణి రాగంలో, ఎల్లోరా శిల్పమా వంటి సాంగ్ అద్భుతంగా ఉంటాయి.

మొదటిరోజు స్వయంవరం చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. మౌత్ టాక్ తో పుంజుకున్న మూవీ మంచి విజయం సాధించింది. అనంతరం విజయ భాస్కర్-త్రివిక్రమ్ కాంబోలో మన్మధుడు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి హిట్స్ వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక విజయ భాస్కర్ కి గడ్డు రోజులు మొదలయ్యాయి. ఆయన ఫేడ్ అవుట్ అయ్యారు.