TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలను బుధవారం(ఏప్రిల్ 24న) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ప్రకటించారు. బాలికలే ఫలితాల్లో పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదికన్నా 2 శాతం తక్కువ మంది పాస్ అయ్యారు.
జిల్లాల వారీగా ఇలా..
జిల్లాల వారీగా ఇంటర్ ఫలితాలు చూస్తే.. మొదటి సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. తర్వాత మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలు https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో మెమోలు..
బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ఇక రేపటి(ఏప్రిల్ 25న) నుంచి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేకోవచ్చని వెల్లడించారు. మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 24వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వమించాలని విద్యాశాఖ నిర్ణయించింది.