Maruthi Baleno: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఫోర్ వెహికల్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కొందరు తమ అవసరాలను తీర్చుకోవడానికి హ్యాచ్ బ్యాక్ కార్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇవి లో బడ్జెట్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. గత ఏడాది కార్ల అమ్మకాల్లో హ్యాచ్ బ్యాక్ మోడళ్ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో వాటి అమ్మకాలు పెరిగాయి. వీటిలో మారుతికి చెందిన బాలెనో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత మిగతా కంపనీల కార్లకు డిమాండ్ పెరిగింది. ఇంతకీ బాలెనో ఎన్ని యూనిట్లు అమ్మకాలు చేసుకుందంటే?
మారుతికి చెందిన హ్యాచ్ బ్యాక్ కార్లలో బాలెనో కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కారు 90 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 5గురు సురక్షితంగా ప్రయాణించే ఇందులో సీఎన్ జీ వపర్ ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారును రూ.6.6 లక్షల ప్రారంభం నుంచి రూ. 9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
బాలెనో ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలరిస్తుంది. వైర్ లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. సేప్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. దీంతో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండొచ్చు. అలాగే 360 కెమెరా ఉంది. ఇక ఆపిల్, ఆండ్రాయిడ్ కార్ ప్లే కనెక్టివిటితో బాలెనో కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో బాలెనో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఒక్కఏడాదిలో 1,95,660 యూనిట్లు విక్రయించారు. బాలెనో తరువాత టాటాకు చెందిన ఆల్ట్రోజ్ 70,162 కార్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత హ్యుందాయ్ ఐ 10 52,262 విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్లో హ్యాచ్ బ్యాక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అమ్మకాలు వృద్ధి సాధిస్తున్నాయి.