Tandel
Tandel : అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) విడుదలై 11 రోజులు పూర్తి అయ్యింది. ఈ 11 రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని మొదటి వారంలోనే దాటేసింది. చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీ కి సూపర్ హిట్ పడడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా నాగార్జున(Akkineni Nagarjuna) ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటల్లో ఆ ఆనందాన్ని మనం గమనించొచ్చు. అయితే ఈ సినిమా 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటిందని మేకర్స్ ఇప్పటికే పోస్టర్స్ విడుదల చేసారు. కానీ ట్రేడ్ లెక్కల్లో మాత్రం ఈ చిత్రం ఇంకా వంద కోట్ల గ్రాస్ ని అందుకోలేదు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పది రోజుల్లో 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 49 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కచ్చితంగా ఇది నాగ చైతన్య కెరీర్ హైయెస్ట్ గ్రాసర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన 100 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరుతుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. జనాల దృష్టిలో పోస్టర్స్ కారణంగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్టే. కానీ ట్రేడ్ లెక్కల్లో కూడా నిజంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను దాటితే బాగుంటుందని అభిమానుల కోరిక. కానీ నిన్న ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే అది సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. బుక్ మై షో లో ఈ చిత్రానికి కేవలం 11 వేల టిక్కెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అమ్ముడుపోయిన టికెట్ సేల్స్ లెక్కల బట్టి చూస్తే నిన్న కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చి ఉండదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ టార్గెట్ ని అందుకోవాలంటే మరో 15 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అనుమానాన్ని అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫిబ్రవరి సినిమాలకు అన్ సీజన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో వచ్చి హిట్ కొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. సమ్మర్ లో విడుదల అయ్యుంటే కచ్చితంగా ఈ చిత్రం ఇప్పుడు చేస్తున్న వసూళ్లకంటే 20 శాతం ఎక్కువ వసూళ్లను రాబట్టి ఉండేదని అంటున్నారు. దానికి తోడు HD ప్రింట్ పైరసీ అవ్వడం, ఈ సినిమా వసూళ్లపై చాలా ప్రభావం చూపించింది. అంతే కాకుండా టాక్ కూడా పర్వాలేదు, యావరేజ్ రేంజ్ లోనే ఉంది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మన్స్ ని చూపించడం లేదు.