https://oktelugu.com/

Nagarjuna: సాధారణంగా అనిపిస్తున్న నాగార్జున ధరించిన ఈ చొక్కా విలువ ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక కుటుంబం బ్రతికేయొచ్చు!

ఈ సీజన్స్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి నాగార్జున అద్భుతమైన హోస్టింగ్ స్కిల్స్. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ తో ఆయన మాట్లాడే తీరు, తప్పు చేసినప్పుడు బలంగా తిట్టే విధానం, బాగా ఆడినప్పుడు మెచ్చుకునే విధానం, ఇలా అన్ని ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందుకే ఇన్ని సీజన్స్ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించినా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 01:56 PM IST

    Nagarjuna

    Follow us on

    Nagarjuna: సినీ హీరో గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అక్కినేని నాగార్జున, బుల్లితెర పై హోస్ట్ గా అంతకు మించిన ప్రజాధారణ సంపాదించుకున్నాడు. స్టార్ మా ఛానల్ లో ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే గేమ్ షో ద్వారా మొట్టమొదటిసారి హోస్ట్ అవతారమెత్తాడు. మూడు సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, మూడు సీజన్లు పెద్ద హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా బాధ్యతలు చేపట్టాడు. సీజన్ 3 నుండి సీజన్ 8 వరకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కి కూడా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మొత్తం మీద 6 సీజన్స్ కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సీజన్ 6 ఒక్కటే ఫ్లాప్ గా నిల్చింది. మిగిలిన సీజన్స్ అన్ని పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

    ఈ సీజన్స్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి నాగార్జున అద్భుతమైన హోస్టింగ్ స్కిల్స్. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ తో ఆయన మాట్లాడే తీరు, తప్పు చేసినప్పుడు బలంగా తిట్టే విధానం, బాగా ఆడినప్పుడు మెచ్చుకునే విధానం, ఇలా అన్ని ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందుకే ఇన్ని సీజన్స్ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించినా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వలేదు. అలాగే వీకెండ్స్ లో నాగార్జున వేసుకునే దుస్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ధరించిన ఈ చొక్కా చూసేందుకు చాలా సాధారణంగా ఉంది కదూ, కానీ దీని ధర 1842 డాలర్స్ అట. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 1,54,209 రూపాయిలు. చూసేందుకు చాలా సింపిల్ గా, అందంగా ఉంది మనం కూడా కొనుక్కుందాం అని గూగుల్ లో దీని ధరణి వెతికిన అభిమానులకు ఫ్యూజులు ఎగిరేంత పని అయ్యింది. అంత డబ్బులు పెట్టి కేవలం సినీ హీరోలు మాత్రమే కొనగలరు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కొనుక్కోవడం అసాధ్యం. 1,54,209 రూపాయలతో రెండు మధ్య తిరగతి కుటుంబాలు నెల రోజులు బ్రతికేయొచ్చు.

    ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభం లో ఆయన సంక్రాంతికి ‘బంగార్రాజు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తమిళ హీరో ధనుష్ తో కలిసి ‘కుభేరా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రం లో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకై తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.