Telangana Sand policy : రూటు తప్పిన సాండ్ టాక్సీలు …100 కిపైగా రీచులున్నా సామాన్యులకు అందని ఇసుక …. ఆంధ్రా ఇసుకకి భలే డిమాండ్..

తెలంగాణలో నాణ్యమైన ఇసుక లభించడం గగనకుసుమమైంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక పాలసీని సవరిస్తూ, సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో సీయం రేవంత్ రెడ్డి కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ ఆచరణలో అది సక్సెస్ కాకపోవడం తో ఇసుక కొనాలంటే అధిక డబ్బు ముట్టచెప్పాల్సిన పరిస్తితి ఏర్పాటుతోంది.

Written By: NARESH, Updated On : September 30, 2024 2:12 pm

Telangana Sand policy

Follow us on

Telangana Sand policy :  తెలంగాణ లో కృష్ణా, గోదావరి నదులలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ ,నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో 100 ఇసుక రీచులున్నాయి. వీటిల్లో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు నిర్ధారించిన రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఇసుకను ఈ- ప్రోక్యూర్మెంట్ ద్వారా వేలం వేసి అమ్మకాలు చేస్తోంది. నాణ్యమైన ఇసుక కావడంతో ఈ ఇసుకని వేలంలో టన్నుకి రూ.500 , రూ.600 కి దక్కించుకున్న ఇసుక వ్యాపారులు హైదరాబాద్ లాంటి నగరాలకి చేరేసరికి రవాణా కలిపి టన్ను కి రూ.6వేల వరకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. సామాన్యులకు ఈ ధర అందుబాటులో లేకపోవడంతో ఇసుక కోసం నిర్మాణధారులు, సామాన్యులు ఇబ్బంధింపడుతున్నారు.

ఏపీ ఇసుక కి భలే డిమాండ్ :
తెలంగాణ లో ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోకి ఏపీ ఇసుక భారీగా వస్తోంది. రాత్రి వేళల్లో అక్రమంగా వచ్చే ఈ ఇసుక లారీలను రవాణా, పోలీసు సిబ్బంది లంచాలు తీసుకొని వదిలేస్తున్నారు. ఈ ఇసుక నాణ్యంగా ఉండడంతో మెట్రిక్ టన్నుకి రూ.7 వేల నుంచి రూ.8వేల వరకు చెల్లించి కొంటున్నారు.

జిల్లాల్లో రూట్ తప్పిన సాండ్ టాక్సీ: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానికుల కి ఇసుక ఉచితంగా అందించాలని నిర్ణయించారు. నదులు, వాగులలో ఆరు మీటర్ల బెడ్డుపైన ఇసుక ఉంటే దాన్ని తహశీల్దార్ ఆమోదంతో స్థానిక వినియోగదారులు ఎలాంటి పన్నులు చెలించాల్సిన అవసరం లేకుండా ఎడ్ల బండ్ల ద్వారా తీసు కెళ్ళవచ్చు. జిల్లాల, మండలాల పరిధిలో వినియోగదారుల, ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం కలెక్టర్ల నేతృత్వంలో సాండ్ టాక్సీ పాలసీని అమలు చేస్తున్నారు. జిల్లాలో చిన్న నదులు, వాగులు, పట్టాభూముల్లో ఎక్కడెక్కడ ఎంత మేర ఇసుక ఉన్నదనే విషయాన్ని కలెక్టర్, మైనింగ్ ఏడీ, భూగర్భజలశాఖ ఏడీలతో కూడిన కమిటీ నిర్ధారిస్తుంది. ఈ కమిటీ నిర్ధారించిన మేరకు ఆయా మండలాల తహశీల్ధార్లు ఇసుక రవాణాకు వే బిల్లులు జారీ చేస్తున్నారు. ఈ ఇసుకను సాండ్ టాక్సీలో నమోదుచేసుకున్న ట్రాక్టర్ల ద్వారానే వినియోగదారులకు చేర్చాలి. ఒక క్యూబిక్ మీటర్ కి (దాదాపు టన్ను) రూ.600 చెల్లించాలి. అదనంగా దూరాన్ని బట్టి రవాణా ఖర్చు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత పారదర్శకంగా పాలసీ ఏర్పాటైనప్పటికీ అమలులో లోపాలు, అధికారుల చేతివాటం, ఇసుక మాఫియా విచ్చలవిడితో ఇసుక బ్లాక్ మార్కెట్ కి తరలి వెళ్తోంది. సామాన్యులకు రెట్టింపు ధర చెల్లిస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితీ ఏర్పడింది. సూర్యాపేట వంటి జిల్లాలలో ఇటీవలి వరకు సాండ్ టాక్సీ పాలసీ అమలు చేయకుండా పూర్తిగా బ్లాక్ ద్వారానే ఇసుక అమ్మకాలు సాగించడం ఇసుక రవాణాపై మాఫియా నియంత్రణ అర్ధం చేసుకోవచ్చు.