Rishab Shetty: కన్నడ నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కాంతార మూవీతో ఆయన సంచలనాలు నమోదు చేస్తున్నారు. కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార రూ. 200 కోట్ల వసూళ్లను దాటేసింది. కాంతార తెలుగు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.రూ. 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిర్మాత అల్లు అరవింద్ కాంతార చిత్రాన్ని కేవలం రూ. 2 కోట్లకు కొన్నారు. ఇప్పటికే కాంతార ఆయనకు పది కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా సాలిడ్ రన్ కొనసాగుతుంది.కొత్తగా విడుదలైన చిత్రాలకు మించిన ఆదరణ కాంతార దక్కించుకుంటుంది.

ఫైనల్ గా కాంతార రికార్డు బ్రేకింగ్ నంబర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించారు. ఆయన ప్రతిభను దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కొనియాడుతున్నారు. విడుదలైన అన్ని భాషల్లో కాంతార విశేష ఆదరణ దక్కించుకుంటుంది. హిందీ ప్రేక్షకులు సైతం కాంతార చిత్రం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
ఒక్క సినిమాతో ఇంత ఫేమ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి కెరీర్ పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. సినిమాపై మక్కువతో పరిశ్రమకు వచ్చిన రిషబ్ శెట్టి ప్రారంభంలో ఎలాంటి గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేశాడు. 2013లో విడుదలైన లూసిక చిత్రంతో మొదటిసారి ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో రిషబ్ కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా రిషబ్ ప్రయత్నాలు చేశారు. 2016లో విడుదలైన రిక్కీ మూవీతో ఆయన మెగా ఫోన్ పట్టాడు.

రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన రిక్కీ విజయం సాధించింది. అదే ఏడాది మళ్ళీ రక్షిత్ శెట్టితో కిరాక్ పార్టీ మూవీ తెరకెక్కించాడు. కిరాక్ పార్టీ సూపర్ హిట్ కొట్టింది. కాంతార రిషబ్ శెట్టికి దర్శకుడిగా నాలుగో చిత్రం. విశేషం ఏమిటంటే రిషబ్ శెట్టి ఒక తెలుగు సినిమాలో నటించారు. తాప్సీ హీరోయిన్ గా ఏప్రిల్ లో విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ మూవీలో ఖలీల్ అనే పాత్ర చేశారు. అప్పుడు రిషబ్ శెట్టి అంటే ఎవరో తెలియదు కాబట్టి, మిషన్ ఇంపాజిబుల్ చిత్రానికి ఫేమ్ రాలేదు. ఎప్పుడైతే ఆయన ప్రెజెన్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేది.