Christopher Nolan : హాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున సినిమాలు రావాలి అంటే అది ఒక హాలీవుడ్ ఇండస్ట్రీ వల్లే సాధ్యం అవుతుంది. ఇక ఈ విషయాన్ని వాళ్ళు చాలాసార్లు ప్రూవ్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘క్రిస్టోఫర్ నోలన్’ డైరెక్షన్ లో 2000వ సంవత్సరంలో వచ్చిన ‘మెమోంటో ‘ సినిమా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది.
ఇక అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేయడమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో రాసుకున్న స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా ఉండటమే కాకుండా ఆయనకు ఎన్నో అవార్డులను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ప్రతి సీన్ లో ఆయన రాసుకున్న లాజిక్స్ అనేవి సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేస్తాయి…ఇక అంతకు ముందు ఎవరు టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ని ఈ సినిమాలో చూపిస్తూ క్రిస్టోఫర్ నోలన్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు.
ఇక ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు వేరే ఏ థాట్స్ లేకుండా ఓపెన్ మైండ్ తో చూడగలిగితే మాత్రం ఆయనకొక కొత్త అనుభూతిని అయితే ఇస్తుంది. ఇక ముఖ్యంగా ఫ్యూచర్ లో సినిమా తీయాలి అనుకునే ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా ఈ సినిమాని చూస్తే అతనికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగడమే కాకుండా సినిమాకి సంబంధించిన చాలా మేలుకువలు కూడా తెలుస్తాయి. ఇక ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ ఒక కొత్త రకం స్క్రీన్ ప్లే ను తీసుకొచ్చాడు. ఇక మెమోంటో ఇన్స్పిరేషన్ తోనే 2005 వ సంవత్సరంలో మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య హీరోగా గజిని అనే సినిమాను తీశారు.
అయితే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక మెమోంటో ను తమిళ్ తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా మార్చుకొని కొన్ని సీన్లను ఆడ్ చేసుకుంటూ ఈ సినిమాని తీశాడు. గజినీ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో సూపర్ సక్సెస్ అయింది. ఇక బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ తో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ సక్సెస్ ని అందుకుంది…