https://oktelugu.com/

SL : లంక ఆశలపై వరుణుడి నీళ్లు..లీగ్ దశ నుంచి ఇంటికి

గ్రూప్ - డీ లో శ్రీలంక జట్టు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. నేపాల్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్లో విజయం సాధించి, సూపర్ -8 కు వెళ్లాలనుకున్న శ్రీలంక ఆశలు నీరు కారిపోయాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2024 / 10:29 PM IST

    sri-lanka-120750554-16x9_0

    Follow us on

    SL : టి20 వరల్డ్ కప్ పై ఆశలు పెంచుకున్న జట్లలో శ్రీలంక కూడా ఒకటి. కానీ ఈసారి కూడా ఆ జట్టు ఆశలు నెరవేరలేదు. కీలక మ్యాచ్లో ఓడిపోవడం.. గెలవాల్సిన మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించడంతో టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక కథ ముగిసింది. దీంతో ఆ జట్టు ఇంటిదారి పట్టింది. గ్రూప్ – డీ లో శ్రీలంక జట్టు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. నేపాల్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్లో విజయం సాధించి, సూపర్ -8 కు వెళ్లాలనుకున్న శ్రీలంక ఆశలు నీరు కారిపోయాయి. ఫ్లోరిడాలో బుధవారం జరగాల్సిన ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. చివరికి 5 ఓవర్ల ఆటైనా కొనసాగించాలని భావిస్తే.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ఎంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ – డీ లో మూడు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా 6 పాయింట్ల సహాయంతో సూపర్ -8 కు చేరుకుంది.

    ఇక గ్రూప్ – బీ లో సూపర్ -8 కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. అంటిగ్వా వేదికగా నమిబియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ -8 కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి చేదించింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 6 పాయింట్లతో సూపర్ -8 కు చేరుకుంది. ఈ గ్రూపులో నమీబియా మూడు మ్యాచ్లు ఆడి, (ఒక విజయం), ఒమన్(మూడు మ్యాచ్లు మూడు ఓటములు) తో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.. ఈ గ్రూప్ నుంచి స్కాట్లాండ్ సూపర్ -8 కు చేరుకునే అవకాశం ఉంది.. ఇక ప్రస్తుతం ఆ జట్టు మూడు మ్యాచ్ లు ఆడి, ఐదు పాయింట్లతో కొనసాగుతోంది.

    ఇక గ్రూప్ – బీ లో డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లాండ్.. ఈసారి టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో ఇంగ్లీష్ ఒకదాంట్లో ఓటమిపాలైంది, మరొక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇంగ్లాండ్ జట్టు సూపర్ -8 కు చేరాలంటే తప్పకుండా మిగిలిన రెండు మ్యాచ్లలో (ఒమన్, నమిబియా) భారీ పరుగుల తేడాతో గెలవాలి. దాంతోపాటు స్కాట్లాండ్ తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాలి.