https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు…కారణం ఏంటి..?

Allu Arjun పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు అర్జున్ రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ రెండు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి...

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2024 / 10:01 PM IST

    Sai Dharam Tej unfollowed Allu Arjun

    Follow us on

    Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ గా మంచి క్రేజ్ అయితే ఉంది. అయితే పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అయితే తలెత్తాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అని తెలిసిన కూడా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ అల్లు ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేదు. ఇక దాంతో కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయనే విషయాలకు ఇప్పుడు ఆజ్యం పోసినట్లయింది. ఇక ఇప్పుడు మరొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ను ట్విట్టర్, ఇన్ స్టా లో అన్ ఫాలో చేశాడు అనే న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

    నిజానికి ఈ గొడవ మొత్తం జరగడానికి గల కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా నంద్యాల నుంచి పోటీ చేసిన వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి కి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురానికి రాని అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్ళాడు.

    ఇక ఆ ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా అల్లు అర్జున్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక దానికి తోడుగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు అర్జున్ రాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ రెండు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి…