Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలం గా సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ని నీవున్న మొన్నటి వరకు #PKSDT అనే టైటిల్ తో పిలిచేవారు. నిన్న ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ని పెట్టి, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో విడుదల చేసింది మూవీ టీం.ఈ మోషన్ పోస్టర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించారు. ఇది ఇలా ఉండగా బ్రో అనేది ఒక ఇంగ్లీష్ పదం అనే విషయం అందరికీ తెలిసిందే. తమ్ముడు ని కానీ, అన్నయ్యని కానీ పిలవడానికి ఈమధ్య కాలం లో చాలా కామన్ గా ఉపయోగించే పేరు అది. స్నేహితులను కూడా బ్రో అని పిలిచేస్తుంటాం.
‘బ్రో’ అంటే ‘తమ్ముడు’ అని కూడా అనొచ్చు.పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం లో తమ్ముడు అనే చిత్రం వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ని పెట్టడానికి ఒక కారణం ఉందట. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నాడు. ‘బ్రో’ అనే అక్షరం తో శివ శ్లోకం మొదలు అవుతుంది. ‘బ్రోవగ ధర్మ శేషం..బ్రోచిన కర్మహాసం..బ్రోతర చిద్విలాసం’ అంటూ శివ శ్లోకం తో మోషన్ పోస్టర్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది.
ఆంగ్ల పదాన్ని సంస్కృతం తో జోడించాలనే ఆలోచన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలా వచ్చిందో కానీ, జీనీస్ అంటూ అభిమానులు అతనిని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.అంతే కాదు ఈ సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఒకరినొకరు బ్రో అని పిలుచుకుంటూ ఉంటారట.అలా అన్నీ విధాలుగా కలిసి వచ్చింది కాబట్టే ఈ చిత్రానికి బ్రో అనే టైటిల్ ని పెట్టినట్టు సమాచారం.