Vijay Devarakonda: ఈరోజు రిలీజ్ అయిన కల్కి సినిమాని చూడడానికి ప్రేక్షకులు చాలా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మీద మరింత బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక సినిమా యూనిట్ ప్రమోషన్స్ ఏమీ పెద్దగా చేయనప్పటికీ దీని మీద అంచనాలైతే తారాస్థాయిలో ఉండటం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే లాంటి నటి నటులు ఉన్నప్పటికీ మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్ పోషించారు.
ఇక అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన అర్జునుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. నిజంగా చెప్పాలంటే ఈ పాత్ర కనిపించింది ఒక్క నిమిషం అయిన కూడా ప్రేక్షకుల్లో ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకొని తను చేయాల్సిన మ్యాజిక్ అయితే చేసేసాడు. ఇక మొత్తానికైతే కల్కి అనేది మహాభారతాన్ని బేస్ చేసుకొని ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కినప్పటికీ ఈ సినిమా అటు సినిమా లవర్స్ ని, ఇటు దైవభక్తి ఉన్నవారిని ఇద్దరిని ఆకట్టుకుంటు సినిమా ముందుకు దూసుకెళ్తుంది.
Also Read: Kalki Movie: కల్కి సినిమాలో రాంగోపాల్ వర్మ… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..?
ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను సాధించి ఇంతకు ముందు ప్రభాస్ క్రియేట్ చేసిన బాహుబలి 2 రికార్డు ను కూడా బ్రేక్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకి విశేషమైన స్పందన లభిస్తుంది. వాళ్లు చాలా రోజుల నుంచి ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంతకుముందు వచ్చిన ‘సలార్ ‘ సినిమా వాళ్ళకి బాగా నచ్చడంతో ‘కల్కి ‘ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలను పెంచేసుకున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ రేంజ్ లో విజువల్స్ ఉండడం, సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ గా ఉండటం తో అక్కడి ప్రేక్షకులకు అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చేసిందనే చెప్పాలి…