Coolie: రజినీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున పాత్ర ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…

లోకేష్ ఇంతకుముందు కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే రజనీకాంత్ కూడా తనకు ఒక మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాలని లోకేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : September 2, 2024 11:04 am

Coolie

Follow us on

Coolie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో రజినీకాంత్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే రజనీకాంత్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కూలి అనే సినిమా చేస్తున్నాడు. అయితే లోకేష్ ఇంతకుముందు కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే రజనీకాంత్ కూడా తనకు ఒక మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాలని లోకేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో రజనీకాంత్ ను ఎదుర్కునే విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలని అనుకున్నారట. ఇక దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ కోసం చాలామంది యాక్టర్స్ ను అనుకున్నప్పటికీ చివరికి నాగార్జున గారితో చేయించాలని తను అనుకొని నాగార్జునను ఆ క్యారెక్టర్ లో తీసుకున్నాడు. ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ లో నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా సరికొత్త పాత్ర చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగార్జున డిఫరెంట్ పాత్రను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆయన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘ కుబేర ‘ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు రజనీకాంత్ కూలి సినిమాలో కూడా నడుస్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఆయన పలు రకాల వైవిధ్యమైన పాత్రలకి గ్రీన్ సిగ్నన్ ఇస్తున్నాడు.

ఇక మొత్తానికైతే విలన్ పాత్రలో నాగార్జున నటించడం ఇదే మొదటిసారి కాబట్టి ఇందులో తన నట విశ్వరూపాన్ని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమాలో నాగ్ విలనిజం బాగా పండినట్లయితే ఇకమీదట విలన్ గా తన పాత్రలను కొనసాగిస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్త అవుతున్నాయి… ఇక నాగార్జున స్టైలిష్ డాన్ విలన్ పాత్రను పోషించడం అనేది ఈ సినిమాకి ఒక పెద్ద ఆకర్షణ నిలవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో నాగార్జున సరికొత్త ట్రెండ్ కి తెరలేపుతాడా లేదా అనేది… ఒక్కసారి ఈ సినిమాతో నాగార్జున కనక తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం నాగార్జున విలన్ గా చాలా మంచి పాత్రలను పోషిస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్స్ రాకపోవడంతో ఎప్పటికప్పుడు ఈ న్యూస్ అనేది సైడ్ అయిపోతున్నాయి…