https://oktelugu.com/

Nagarjuna: కుబేర మూవీలో నాగార్జున పాత్ర ఏంటో తెలుసా..?

ధనుష్ ను హీరోగా పెట్టి కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఇది మనీ చుట్టూ తిరగబోతున్న కథగా తెలుస్తుంది. అలాగే ఇందులో నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 09:49 AM IST

    Do you know the role of Nagarjuna in Kubera movie

    Follow us on

    Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో సినిమాలను చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన సినిమాలు చాలా కూల్ గా, నీటుగా ఉంటూ ముందుకు కదులుతూ ఉంటాయి. ఇక ఈయన సినిమాలను చూడడానికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే యూత్ అభిమానులు కూడా ఈయనకి ఎక్కువమంది ఉన్నారు. ఇక తన కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులో మంచి విజయాలను అందుకున్నాడు.

    ‘ఆనంద్’ సినిమా నుంచి చివర గా వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా బాగుంటాయి. అందులో ఒకటి రెండు ప్లాపులుగా మిగిలినప్పటికీ మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లు సాధించాయి. ముఖ్యంగా సాయిపల్లవి మెయిన్ లీడ్ గా పెట్టి చేసిన ‘ఫిదా ‘ సినిమా అయితే సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో శేఖర్ కమ్ముల స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ధనుష్ ను హీరోగా పెట్టి కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఇది మనీ చుట్టూ తిరగబోతున్న కథగా తెలుస్తుంది. అలాగే ఇందులో నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇక రీసెంట్ గా నాగార్జునకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

    అయితే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు నాగార్జున చేయనటువంటి పాత్ర పోషిస్తున్నాడు అని శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూ లో అయితే చెప్పాడు. మరి ఇప్పటివరకు నాగార్జున విలన్ గా చేయలేదు కాబట్టి ఈ సినిమాలో విలన్ గా చేసి మెప్పించబోతున్నాడా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే శేఖర్ కమ్ముల ధనుష్ నాగార్జున లతో ఒక భారీ సినిమాను చేసి సక్సెస్ కొట్టడమే ధ్యేయం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట…