Vishwambhara: చిరంజీవికి ప్రయోగాలు కలిసి రావడం లేదా..? మరి విశ్వంభర పరిస్థితి ఏంటి..?

చిరంజీవి ఎవరినైనా కొడితే అభిమానులు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఆనందపడతారు. కానీ చిరంజీవిని ఎవరైనా కొడితే వాళ్ళు జీర్ణించుకోలేరు. అందువల్లే కమర్షియల్ సినిమాలు అయితే హీరోయిజం, ఎలివేషన్స్, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి.

Written By: Gopi, Updated On : May 9, 2024 9:45 am

Vishwambhara

Follow us on

Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నా నటుడు చిరంజీవి… ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా నటుడుగా కూడా చిరంజీవి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇక ముఖ్యంగా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు ఆయన అందుకున్న అవార్డులు, ఆయన పొందిన రివార్డులను దానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి లాంటి ఒక సామాన్య వ్యక్తి మెగాస్టార్ గా మారిన వైనం చూస్తుంటే ప్రతి ఒక్కరు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ల వృత్తిలో రాణిస్తే తప్పకుండా సక్సెస్ అవతారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాల పరంగా ప్రయోగాలు చేసిన ప్రతిసారి దెబ్బ తింటూ వస్తున్నాడు. ఆయన కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు సక్సెస్ లను అందుకుంటున్నాడు. కానీ కొంచెం కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు ప్రేక్షకులు దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే చిరంజీవిని సినిమా హీరో గానే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

చిరంజీవి ఎవరినైనా కొడితే అభిమానులు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఆనందపడతారు. కానీ చిరంజీవిని ఎవరైనా కొడితే వాళ్ళు జీర్ణించుకోలేరు. అందువల్లే కమర్షియల్ సినిమాలు అయితే హీరోయిజం, ఎలివేషన్స్, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రేక్షకులు ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆయన కొత్తగా ట్రై చేసి చేసిన ప్రయోగాల్లో మృగరాజు సినిమా ఒకటి..కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత సైరా సినిమా చేసినప్పటికీ అది కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఇప్పుడు విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటూ ఇప్పుడు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ సాధించి చిరంజీవి ప్రయోగాలు చేసిన కూడా సక్సెస్ లు కొడతాడు అని నిరూపించుకుంటాడా.? లేదంటే ఈ సినిమా కూడా అదే బాటలో ప్లాప్ అయి చిరంజీవి ఇక ప్రయోగాలు చేయడం వేస్ట్ అని అనిపించుకుంటాడా అనేది తెలియాలంటే విశ్వంభర సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…