Site icon OkTelugu

Uttar Pradesh: భార్య చేసే పనులపై సీసీ కెమెరాలు పెట్టించిన భర్త.. చూసి షాకైన పోలీసులు

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: అతడి పేరు మనన్ జైదీ.. సొంత ఊరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లా. అతడికి ప్రియ (పేరు మార్చాం) అనే యువతితో వివాహమైంది. వివాహమైన నాటినుంచి ప్రియ మనన్ జైదీ ని వేధిస్తోంది. శారీరకంగా ఇబ్బంది పెడుతోంది.. ఈ విషయంపై అతడు పలుమార్లు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు చేసినప్పటికీ ప్రియ ప్రవర్తన మారలేదు. పైగా అతడి మర్మాంగాలపై సిగరెట్ వెలిగించి వాతలు పెట్టింది.. దీనిపై మనన్ జైదీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రియను అదుపులోకి తీసుకున్నారు. అతడు కీలకమైన ఆధారాలు ఇవ్వడంతో.. అరెస్టు చేశారు.

మనన్ జైదీ ని ప్రియ శారీరకంగా వేధిస్తోందట. మత్తుమందు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తోందట. అతడు మత్తులో ఉన్నప్పుడు చేతులు, కాళ్లు కట్టేసి సిగరెట్ వెలిగించి ప్రైవేట్ పార్ట్స్ పై వాతలు పెడుతోందట. దీనికి సంబంధించి మనన్ జైదీ పోలీసులకు సీసీ పుటేజ్ రికార్డు అందించాడు. గతంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్టు మనన్ జైదీ చెప్పుకొచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు ప్రియ పై హత్యాయత్నం, దాడికి పాల్పడటం, చిత్రహింసలకు గురిచేయడం వంటి వాటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ” మనన్ జైదీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఆమెను అదుపులోకి తీసుకున్నాం. విచారణ ఆధారంగా మిగతా చర్యలు తీసుకుంటామని” ఎస్పీ ధరమ్ పాల్ సింగ్ ప్రకటించారు.

మనన్ జైదీ పై ప్రియ వేధింపులకు పాల్పడటం వెనుక కారణం ఏంటనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని చెబుతున్నారు. అందువల్లే మనన్ జైదీ పై వేధింపులకు పాల్పడుతోందని.. తాము పలుమార్లు చెప్పినప్పటికీ ఆమె తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..మనన్ జైదీ అమాయకుడని.. ఇప్పటికీ అతడికి తన భార్య అంటే ప్రేమ ఉందని చెబుతున్నారు. కానీ ప్రియ ప్రవర్తన సరిగ్గా లేదని.. ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అంటున్నారు.. మరి దీనిపై పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

మరోవైపు ప్రియ బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు..మనన్ జైదీ మద్యానికి బానిసయ్యాడని, తన తీరు మార్చుకోవాలని ప్రియ అడిగినందుకు ఇలాంటి లేనిపోని అబాండాలు వేస్తున్నాడని ఆమె తరఫున బంధువులు అంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. గతంలో ప్రియ పై శారీరకంగా దాడికి పాల్పడ్డాడని.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Exit mobile version