Superstar Krishna Remuneration: సూపర్ స్టార్ కృష్ణ నట ప్రస్థానం దశాబ్దాలపాటు సాగింది. తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేని ఎన్నో బ్లాక్ బస్టర్స్ కృష్ణ ఇచ్చారు. స్టార్ డమ్ వచ్చాక నిర్మాతగా, దర్శకుడిగా మారారు.సుదీర్ఘ కెరీర్ లో కృష్ణ 340కి పైగా చిత్రాలు చేశారు. ఎన్ని చిత్రాలు చేసినా ఫస్ట్ మూవీ అనేది చాలా ప్రత్యేకం. ఎంత సంపాదించినా ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుండి పోతుంది. కృష్ణ తన ఫస్ట్ సినిమా తేనె మనసులు చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?. ఆ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన కృష్ణ హీరో కావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. చదువు పూర్తి కాగానే చెన్నై చెక్కేశారు. ఫోటోలు చేతిలో పట్టుకొని మద్రాసు పట్టణంలో దర్శక నిర్మాతల ఆఫీసులు, స్టూడియోల చుట్టూ తిరిగాడు. చిన్న చిన్న ఆఫర్స్ వచ్చాయి కానీ హీరో అవకాశం మాత్రం రాలేదు. అప్పటి స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు మూవీ కోసం ఆడిషన్స్ జరుపుతున్నారు. ఆయనకు ఒక యంగ్, చార్మింగ్ ఫెలో కావాలి. అది కూడా కొత్త వాడై ఉండాలి.
తేనెమనసులు ఆడిషన్స్ కి చాలా మంది హాజరయ్యారు. కృష్ణ కూడా వెళ్లారు. కృష్ణ మంచి హైట్ , తెల్లని రంగు, చక్కని రూపంతో బాలీవుడ్ హీరోలను తలపించేవాడు. సుబ్బారావుకు ఈ కుర్రాడైతే బాగుంటాడు అనిపించింది. కృష్ణను తేనె మనసులు హీరోగా ఎంచుకున్నారు. ఇదే ఆడిషన్ కి కృష్ణంరాజు కూడా హాజరయ్యారు. కానీ కృష్ణ ఎంపికయ్యారు. 1965లో విడుదలైన తేనె మనసులు సూపర్ హిట్. కృష్ణ నటన, అందం ప్రేక్షకులకు నచ్చాయి. అలా ఒక వెండితెర చరిత్రకు నాంది పడింది.
ఒక సందర్భంలో కృష్ణ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చెప్పారు. తేనె మనసులు చిత్రానికి నాకు రూ. 2000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్ అని కృష్ణ తెలియజేశారు. ఈ తరం హీరోలు ఒక హిట్ పడగానే రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. నేను 30 చిత్రాలకు వరకు రూ. 5000 రెమ్యూనరేషన్ తీసుకుని పని చేశాను. ఎన్నో హిట్స్ పడినా రెమ్యూనరేషన్ పెంచలేదని కృష్ణ చెప్పుకొచ్చారు.

కృష్ణకు నిర్మాతల హీరో అనే పేరుంది. తన మూవీ ప్లాపై నిర్మాత నష్టపోతే అతనికి ఒక సినిమా ఫ్రీగా చేసి పెట్టేవాడట. ఇలాంటి నిర్ణయాల వలన కృష్ణ ఆర్థికంగా నష్టపోయారట. ఆయన స్టార్ డమ్ కి కోట్లు సంపాదించాల్సి ఉండగా… కృష్ణ డబ్బుల విషయంలో గట్టిగా ఉండకపోవడం వలన పెద్దగా ఆర్జించలేదట. కృష్ణ నిర్మాతగా అనేక సినిమాలు తెరకెక్కించారు. వాటిలో మెజారిటీ చిత్రాలు ప్లాప్ కావడంతో ఆయన ఇబ్బందులు పాలయ్యారట.