https://oktelugu.com/

NTR And Anushka: అనుష్క తో ఎన్టీఆర్ సినిమా చేయకపోవడానికి కారణం అదేనా..? ఇద్దరి మధ్య ఇంత రగడ జరిగిందా!

వాస్తవానికి మెహర్ రమేష్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి చిత్రం లో ముందుగా అనుష్క ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ అనుష్క గురించి జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ కి చెందిన ఒక టాప్ సీనియర్ నిర్మాత లేనిపోనివి చెప్పాడట.

Written By:
  • Vicky
  • , Updated On : August 14, 2024 / 05:18 PM IST

    NTR And Anushka

    Follow us on

    NTR And Anushka: టాలీవుడ్ లో నేటి తరం స్టార్ సెలెబ్రిటీల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజమే, నేటి తరం స్టార్స్ మధ్య అలాంటి సాన్నిహిత్యమే ఉంది. కానీ ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా మూడవ వ్యక్తి కారణంగా కొంతమంది సెలబ్రిటీస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. అలాంటి కోల్డ్ వార్ అనుష్క, ఎన్టీఆర్ మధ్య జరిగింది అనే విషయం చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరితో సినిమాలు చేసేసాడు, ఒక్క అనుష్క తో తప్ప. విక్టరీ వెంకటేష్, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ‘చింతకాయల రవి’ చిత్రంలోని ఒక పార్టీ సాంగ్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా కనిపిస్తాడు. ఆ ఒక్క పాటలో ఎన్టీఆర్ – అనుష్క – వెంకటేష్ కలిసి డ్యాన్స్ వేస్తారు. అంతే ఆ తర్వాత ఎన్టీఆర్ – అనుష్క కాంబినేషన్ లో పూర్తి స్థాయి సినిమా ఇప్పటి వరకు రాలేదు.

    వాస్తవానికి మెహర్ రమేష్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి చిత్రం లో ముందుగా అనుష్క ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ అనుష్క గురించి జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ కి చెందిన ఒక టాప్ సీనియర్ నిర్మాత లేనిపోనివి చెప్పాడట. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం సుమారుగా 32 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిందని, ఆ స్థాయి వసూళ్లు ఇప్పుడున్న స్టార్ హీరోలెవ్వరికీ రాలేదని, అందుకే అనుష్క వేరే హీరో సినిమాలో హీరోయిన్ రోల్ చెయ్యాల్సి వస్తే హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని, ఆమెకి చాలా ఈగో ఉందంటూ లేనిపోని చాడీలు చెప్పాడట. దీంతో ఎన్టీఆర్ మెహర్ రమేష్ కి ఫోన్ చేసి అనుష్క కి బదులుగా ఇలియానా ని తీసుకోమని చెప్పాడట.

    కానీ మెహర్ రమేష్ అప్పటికే అనుష్క తో మాట్లాడి, ఈ సినిమాలో నటింపచేసేందుకు ఒప్పించి, డేట్స్ కూడా తీసుకున్నాడట. ఎన్టీఆర్ అకస్మాత్తుగా అలా చెప్పేలోపు ఇక చేసేదేమి లేక అనుష్క ని ఆ సినిమా నుండి తప్పించి ఇలియానా ని తీసుకున్నాడట. పాపం అనుష్క ఒక పెద్ద తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాని పక్కకి నెట్టి ఎన్టీఆర్ శక్తి సినిమా కోసం డేట్స్ కేటాయించింది. అకస్మాత్తుగా సినిమా నుండి తనని తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకునేలోపు ఆమె మనస్సు బాగా నొచ్చుకుంది. అప్పటి నుండి ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై పీకలదాకా కోపం పెంచేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఒక సీనియర్ నిర్మాత కారణంగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. అనుష్క మీద అంత పగతో లేనిపోని చాడీలు చెప్పే అవసరం ఏ నిర్మాతకి ఉంటుంది..?, బహుశా ఆ నిర్మాతకి అనుష్క డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.