Rajamouli: రాజమౌళి సినిమాల్లో ఒక్కటి కూడా ప్లాప్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

రాజమౌళి సీక్రెట్ ఏమీ లేదు ఫెయిల్యూర్ అంటే ఆయనకి చాలా భయం. దాన్ని తట్టుకోని నిలబడాలంటే చాలా గట్స్ ఉండాలి. కాబట్టి రాజమౌళికి అలాంటి గట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. దానివల్లే ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుందో అని భయపడి తను చాలా వరకు కష్టపడి పనిచేసి సినిమాలను విజయ తీరాలకు చేర్చాలని చూస్తూ ఉంటాడు.

Written By: Gopi, Updated On : February 18, 2024 9:41 am

Rajamouli

Follow us on

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా రాజమౌళి రాజముద్ర ఎప్పుడు సక్సెస్ ని సాధిస్తు గ్రాఫ్ అనేది సినిమా సినిమాకి పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గడం లేదు. ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి వరుస సక్సెస్ లు కొట్టడం వెనక సీక్రెట్ ఏంటి అంటూ చాలా సంవత్సరాల నుంచి చాలా మంది అభిమానులు ఆయన విజయ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రాజమౌళి సీక్రెట్ ఏమీ లేదు ఫెయిల్యూర్ అంటే ఆయనకి చాలా భయం. దాన్ని తట్టుకోని నిలబడాలంటే చాలా గట్స్ ఉండాలి. కాబట్టి రాజమౌళికి అలాంటి గట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. దానివల్లే ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుందో అని భయపడి తను చాలా వరకు కష్టపడి పనిచేసి సినిమాలను విజయ తీరాలకు చేర్చాలని చూస్తూ ఉంటాడు.

అందువల్లే ఒక సినిమా కోసం దాదాపు 20 గంటల దాకా కష్టపడుతూ తను అనుకున్నా ఔట్ పుట్ తీసుకొచ్చేంత వరకు సినిమాని చెక్కుతూనే ఉంటాడు. ఒక సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అనేది రాజమౌళికి తెలిసినంత గొప్పగా మరే డైరెక్టర్లకు తెలియదు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ తో బాహుబలి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి పేరు మారుమ్రోగిపోయేలా చేశాయి.

అందుకే రాజమౌళి అంటే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అలాగే తన నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు భారీ అంచనాలతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రాజమౌళి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎక్కడో చిన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న సినిమాలు చేసుకునే స్థాయి నుంచి పాన్ వరల్డ్ లో సినిమా చేసే స్థాయి కి ఎదిగాడు అంటే నిజంగా తెలుగు వాళ్ళం అయిన మనందరం గర్వపడాలనే చెప్పాలి…