Amardeep: సీరియల్ నటుడు అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ అమర్ దీప్ విషయంలో బిగ్ బాస్ షో శాపమైంది అని చెప్పవచ్చు. అతనికి కొంత పాపులారిటీ వచ్చినప్పటికీ అంత కంటే దారుణంగా నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురైయ్యాడు. అమర్ యాంటీ ఫ్యాన్స్ అతని ఫ్యామిలీ ని కూడా అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశారు. అమర్ దీప్ ప్రవర్తన నచ్చని కొందరు ఆడియన్స్ ఈ పని చేశారు.
ఇక ఫినాలే తర్వాత ఏకంగా అమర్ కారును చుట్టుముట్టి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దారుణంగా దూషిస్తూ దాడి చేసిన సంగతి తెలిసిందే. అమర్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు విన్నర్ మెటీరియల్ అని అంతా భావించారు. కానీ మొదట్లో అతను పల్లవి ప్రశాంత్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, లెక్క లేకుండా మాట్లాడటం వలన నెగిటివిటీ వచ్చింది. పైగా తొండాట ఆడుతూ ప్రతి శనివారం హోస్ట్ నాగార్జునతో తిట్లు తినడంతో… అమర్ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా డౌన్ అయ్యాడు.
అమర్ పై వస్తున్న నెగిటివిటీని చూసిన అతని భార్య తేజస్విని చాలా బాధ పడిందట. బిగ్ బాస్ ఓ ఖర్మలా అనిపించిందంటూ సంచలన కామెంట్స్ చేసింది. అమర్ దీప్ బిగ్ బాస్ కి వెళ్ళినపుడు ఆమె నరకం అనుభవించిందట. అమర్ హౌస్ లో ఏం చేసినా నెగిటివ్ గా హైలైట్ చేసేవారు. బిగ్ బాస్ లైవ్ చూడాలంటే భయం వేసేదని అన్నారు. బిగ్ బాస్ ఒక ఖర్మ… అది ఎప్పుడెప్పుడు వదిలిపోతుందా అని ఎదురుచూసినట్లు తేజస్విని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కాగా అమర్ దీప్ తేజు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట అమర్ ప్రపోజ్ చేస్తే .. తేజు రిజెక్ట్ చేసిందట. జస్ట్ ఫ్రెండ్స్ లా ఉందాం అని చెప్పిందట. ఇక మూడేళ్ల తర్వాత అమర్ తేజస్విని కి మళ్ళీ ప్రపోజ్ చేయగా .. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఓకే .. లేదంటే మర్చిపోమని చెప్పిందట. పెద్ద వాళ్ళతో మాట్లాడి ఒప్పించి నన్ను అమర్ పెళ్లి చేసుకున్నాడు అని తేజస్విని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా త్వరలో తేజస్విని తల్లి కాబోతుందని సమాచారం.