https://oktelugu.com/

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానికి అసలు కారణం ఏంటో తెలుసా?

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణంతో అటు సినీలోకం.. ఇటు అభిమాన లోకం విషాదంలో మునిగిపోయింది. కరోనా బారిన పడి కోలుకున్న బాలు సడన్‌గా మళ్లీ ఎందుకు అనారోగ్యానికి గురయ్యాడనేది అందరిలోనూ ప్రశ్నలా మిగిలింది. హాస్పిటల్‌కు ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లిన బాలు.. అక్కడే ఎలా చివరి శ్వాస విడిచాడు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్లు దీపక్‌ సుబ్రమణియన్‌, సభానాయగం ఓ ప్రకటన విడుదల చేశారు. Also Read: రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా? మెదడులో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 11:51 AM IST
    Follow us on


    గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణంతో అటు సినీలోకం.. ఇటు అభిమాన లోకం విషాదంలో మునిగిపోయింది. కరోనా బారిన పడి కోలుకున్న బాలు సడన్‌గా మళ్లీ ఎందుకు అనారోగ్యానికి గురయ్యాడనేది అందరిలోనూ ప్రశ్నలా మిగిలింది. హాస్పిటల్‌కు ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లిన బాలు.. అక్కడే ఎలా చివరి శ్వాస విడిచాడు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్లు దీపక్‌ సుబ్రమణియన్‌, సభానాయగం ఓ ప్రకటన విడుదల చేశారు.

    Also Read: రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా?

    మెదడులో రక్తస్రావం, శ్వాసకోశ సమస్యలతోనే ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఊబకాయం తగ్గించుకునేందుకు ఏడేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయించుకోవడం మినహా ఆయనకు మధుమేహం కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆహారపు నియమాలను కూడా చక్కగా పాటించేవారని తెలిపారు.

    ‘ఆగస్టు 3న జలుబు, జ్వరం రావడంతో మా ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసుకున్నప్పుడు స్వల్పంగా కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలని ఆయనకు సూచించాం. ఆగస్టు 5న ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంతో 9న అత్యవసర చికిత్స విభాగానికి తరలించాం’ అని చెప్పారు.

    Also Read: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అనుష్క..?

    13న వెంటిలేటర్‌, మరుసటి రోజు ఎక్మో పరికరం అమర్చినట్లు డాక్టర్లు తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన వైద్య నిపుణుల సలహాలతో చికిత్స చేశామన్నారు. దీంతో ఆయన స్పృహలోకి వచ్చి అందరినీ గుర్తించగలిగారని, సెప్టెంబరు 5న వివాహవార్షికోత్సవం కూడా జరుపుకున్నారని పేర్కొన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకుని కోలుకుంటూ వచ్చారని, గత గురువారం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి ఆందోళనకరంగా మారిందన్నారు. శరీరమంతా వైరస్‌ వ్యాప్తించి అవయవాలు దెబ్బతిన్నాయని, వెంటనే సీటీస్కాన్‌ తీసి పరీక్షించినప్పుడు మెదడులో రక్తస్రావం గుర్తించామన్నారు. అదే సమయంలో శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఫలితం లేకపోయిందని వైద్యులు పేర్కొన్నారు.