https://oktelugu.com/

మరో వివాదంలో ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి?

వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్థులను వెంటాడుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలను.. ఆపార్టీకి సహకరించిన పెద్ద తలకాయలను టార్గెట్ చేసిందా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదే అనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటిపై వరుసగా రెండో కేసును ఏపీ సర్కార్ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అమరావతి భూకుంభకోణంలో ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 11:24 AM IST
    Follow us on

    వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్థులను వెంటాడుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలను.. ఆపార్టీకి సహకరించిన పెద్ద తలకాయలను టార్గెట్ చేసిందా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదే అనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటిపై వరుసగా రెండో కేసును ఏపీ సర్కార్ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అమరావతి భూకుంభకోణంలో ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.. అది మరిచిపోకముందే దమ్మాలపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.

    Also Read: సంచలనం: తప్పు జరిగింది.. సారీ చెప్పిన ఏపీ హోంమంత్రి

    రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్మోహన్ తాజాగా దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం నలుగురిపై 420,406,506,120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో రిటైర్డ్ లెక్చరర్ రామ్మోహన్ కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్ మెంట్లు నిర్మించాడు. ఫ్లాట్ విషయంలో తనను మోసం చేశారని రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. తాను ఒక రిటైర్డ్ లెక్చరర్ అని.. విజయవాడలోని ఉన్న ఇంటిని అమ్ముకున్నట్లు చెప్పాడు.

    ఆ తర్వాత ఫ్లాట్ కొందామని చూస్తుంటే ‘క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్’ ఎండీ నన్నపనేని సీతరామరాజు తనకు లేక్ వ్యూ లో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లు కొనాలని చెప్పాడని.. ఇందులో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబానికి భాగం ఉందని నమ్మించాడని తెలిపారు.

    Also Read: ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ గుడ్ బై

    దీంతో రూ.50లక్షలు చెల్లించి రెండు ప్లాట్లు బుక్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చానని.. ఇప్పటిదాకా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రామ్మోహన్ ఆరోపిస్తున్నాడు. మరో స్తలాన్ని చూపించారని.. దానికి రూ.73 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశామని.. ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారని.. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని రామ్మోహన్ ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నారని.. లాక్ డౌన్ వల్ల హైదరాబాద్లో ఉన్నానని.. అందుకే ఇంత ఆలస్యంగా దమ్మాలపాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రామ్మోహన్ తెలిపాడు. దీంతో మరో కేసు దమ్మాలపాటిపై నమోదైనట్టు అయ్యింది.