Homeఎంటర్టైన్మెంట్NTR Watch: ఎన్టీఆర్ వేసుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక...

NTR Watch: ఎన్టీఆర్ వేసుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక సినిమానే తీసేయొచ్చు!

NTR Watch: మన స్టార్ సెలెబ్రిటీలు ధరించే వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేయడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉండే సంగతి తెలిసిందే. మధ్య తరగతి కుటుంబ సబ్యులకు అందుబాటులో ఉండే రేంజ్ లో ధరలు ఉంటే కళ్ళు మూసుకొని కొనేస్తుంటారు. అలా కాకుండా వాళ్ళ ఊహలకు అందని విధంగా ధరలు ఉంటే కేవలం చూసి సంతృప్తి చెందుతారు. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ధరించే వస్తువులు రెండవ క్యారగిరీకి సంబంధించినదిగా పరిగణించొచ్చు. ఎన్టీఆర్ కి కార్లు అన్నా, వాచీలు అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్కెట్ లోకి కొత్త వెర్షన్ కి సంబంధించిన కారు కానీ, వాచీ కానీ వచ్చిందంటే ఆయన ఇంట్లో ఉండాలసిందే. రీసెంట్ గానే ఆయన స్టైలిష్ లుక్స్ తో ముంబై విమానాశ్రయం లో ఫోటోగ్రాఫర్స్ కి కనిపించాడు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

Also Read: అడవుల్లో మహేష్ బాబుతో గుర్రపు స్వారీ చేయిస్తున్న రాజమౌళి…మరో వీడియో లీక్ అయిందా..?

అభిమానులు ఫోటోలు చూసి సైలెంట్ గా ఉండరు కదా, హీరో ఎలాంటి డ్రెస్ వేసాడు, ఎలాంటి చెప్పులు తొడుగుకున్నాడు, పెట్టుకున్న వాచీ ఏమిటి?, ఇలా ప్రతీ ఒక్కటి క్షుణ్ణంగా గమనిస్తుంటారు. అలా ఎన్టీఆర్ ధరించిన వాచీ ని కూడా పరిశీలించారు ఫ్యాన్స్. దానిని ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో వెతగగా, దాని ధరను చూసి ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనపడింది. ఈ వాచీ ధర అక్షరాలా 7 కోట్ల 46 లక్షల రూపాయిలు అట. మధ్య తరగతి కుటుంబస్తులు జీవిత కాలం లో అంత డబ్బులు సంపాదించగలరా?, ఆ 7 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ‘డ్రాగన్’ లాంటి సినిమాని తీసి వందల కోట్లు కొల్లగొట్టొచ్చు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం లో సమంత కొట్టిన ఒక డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ‘ఆయన వాచ్ అమ్మితే..మీ బ్యాక్ సెటిల్ అయిపోతుంది’ అని. ఈ డైలాగ్ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘దేవర’ తర్వాత ఆయన హ్రితిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2′(War 2 Movie) మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగష్టు 14న అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్(#NTRNeel) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ప్రస్తుతం. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన ‘దేవర 2’ లో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ ఇది వర్కౌట్ అవ్వదు శివ, నన్ను వదిలేయ్ అన్నా కూడా డైరెక్టర్ కొరటాల శివ వదలడం లేదట. దయచేసి నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడడంతో ఆయన గోల భరించలేక, సరే చేద్దాం అని అన్నాడట. మరి ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక, కొరటాల కి ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.

 

Also Read: లీకైన ‘వార్ 2’ ఫైట్ సీన్..ట్రైన్ ఫైట్ సీన్ మామూలు రేంజ్ లో రాలేదుగా..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version