https://oktelugu.com/

Veera Simha Reddy: ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలకృష్ణ వాడిన విగ్ ధర ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎంత ఊపు లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.’అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్నాడు బాలయ్య. దానికి తోడు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ షో గా నిలవడం తో బాలయ్య క్రేజ్ యూత్ లో ఒక రేంజ్ […]

Written By:
  • Vicky
  • , Updated On : April 25, 2023 / 04:07 PM IST
    Follow us on

    Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎంత ఊపు లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.’అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్నాడు బాలయ్య. దానికి తోడు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ షో గా నిలవడం తో బాలయ్య క్రేజ్ యూత్ లో ఒక రేంజ్ లో పెరిగిపోయింది.

    వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత బాలయ్య బాబు ఈ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతాడని బహుశా బాలయ్య కూడా ఊహించి ఉండదు.ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. అయితే బాలయ్య మేకప్ మ్యాన్ వాసు రీసెంట్ గా చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య బాబు కి విగ్గులు మేము ముంబై నుండి తెప్పించేవాళ్ళం, ఆయన నాసిరకపు విగ్గులను అసలు వాడదు,పాత్రలకు తగ్గట్టుగా విగ్గులు వాడాల్సి వస్తుంది కాబట్టి ఆయన విగ్గులకే లక్షల రూపాయిలు ఖర్చు అవుతుంది.ప్రస్తుతం అన్నీ రకాల విగ్గులు హైదరాబాద్ లోనే దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడే మాకు బాలయ్య కి సంబంధించిన విగ్గులను కొంటున్నాము. ఆయన వాడే విగ్గులకు అయ్యే ఖర్చులను నిర్మాతలే భరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు వాసు.

    బాలయ్య వీరసింహా రెడ్డి లో ఫ్యాక్షనిస్టు గెటప్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. బాలయ్య వాడిన విగ్గు కూడా సహజత్వానికి బాగా దగ్గరగా ఉంటుంది,ఈ విగ్గు అలా ఉండడం కోసం దాదాపుగా 10 లక్షల రూపాయిలు ఖర్చు చేశారట నిర్మాతలు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.