https://oktelugu.com/

Nagarjuna Shirt: నాగార్జున ధరించిన షర్ట్ ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే…

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. దీనికి హోస్ట్ గా కింగ్ నాగార్జుననే కొనసాగుతున్నారు. సీజన్ మొదలయ్యే వరకు ఈ సారి నాగార్జున హోస్ట్ చేయడం లేదని ఎన్నో వార్తలు వచ్చాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 10, 2023 / 11:18 AM IST

    Nagarjuna Shirt

    Follow us on

    Nagarjuna Shirt: నాగార్జున ఒక నటుడు మాత్రమే కాదు.. ఓ మన్మథుడు, ఓ స్టార్, ఓ మంచి మనిషి, ఓ హోస్ట్, ఓ కింగ్, ఇలా ఆయనకు ఎన్ని పేర్లు పెట్టినా తక్కువగానే అనిపిస్తుంటుంది. ఈ స్టార్ నటుడు ఇప్పటి నుంచే కాదు కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసత్వంతో వచ్చిన నాగార్జున తనకంటూ స్పెషల్ మార్కెట్ ను సంపాదించాడు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో కింగ్ అయ్యాడు నాగార్జున. అయితే ఈ స్టార్ ఇప్పుడు ఓ కారణంగా వార్తల్లో నిలిచాడు. ఎందుకు అంటారా?

    బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. దీనికి హోస్ట్ గా కింగ్ నాగార్జుననే కొనసాగుతున్నారు. సీజన్ మొదలయ్యే వరకు ఈ సారి నాగార్జున హోస్ట్ చేయడం లేదని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేకపోయింది. దీంతో ఈ సీజన్ కు కూడా నాగార్జుననే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన ఇప్పుడు ధరించిన చొక్క తెగ వైరల్ అవుతుంది. కలర్ ఫుల్ గా, స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కింగ్.. వెరైటీ డ్రెస్ తో కనిపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్ లో స్టన్నింగ్ లుక్స్ లో కనిపించారు నాగార్జున.

    బిగ్ బాస్ ను రిప్రజెంట్ చేసేలా కన్ను బొమ్మ ఉన్న షర్ట్ తో బీబీ ఫ్లోర్ ను రాక్ చేశారు. తన లుక్ తో అవుట్ ఫిట్ తో అందర్లో హాట్ టాపిక్ గా నిలిచారు నాగ్. అయితే ఈ షర్ట్ ఖరీదు ఎంత ఎవరు డిజైన్ చేశారు అని ఎందరో ఆరా తీస్తున్నారు. అయితే ఈయన ధరించిన షర్ట్ లూయి ఉటాన్ బ్రాండ్ దట. అంతే కాదు దీని ధర కూడా తక్కువగా ఉండదండోయ్.. ఏకంగా రూ. 2,25,495 అని టాక్ వినిపిస్తుంది. అంటే రెండు లక్షల పైమాటే. ఇక ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో నాగ్.. ఇంత ధరనా? అది కూడా బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం ఇంత ఖరీదు చేశారంటే మీరు మామూలు మనిషి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు అక్కినేని అభిమానులు.