BJP Vs Congress: కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. వీటిలో తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మొత్తం 695 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నారు. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ కొనసాగుతుండగా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడుపుతుండగా.. మిజోరాంలో ప్రాంతీయ పార్టీలదే హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ 5 రాష్ట్రాల్లో తన ప్రభావం చూపితేనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్లస్ పాయింట్ గా మారనుంది. ఈ తరుణంలో 5 రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం..
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి అధికార పీఠంపై కూర్చోడానికి సమాయత్తమవుతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. ఇటీవల 6 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఓటర్లను ఆకర్షిస్తోంది. కానీ పార్టీలోని గ్రూపు విభేదాలు పార్టీకి కొంత నష్టం కలిగించే అంశాలున్నాయి. మరోవైపు బీజేపీ కూడా తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్ఠానాలకు 114 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత మారిన పరిస్తితులతో 2020లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతీకార జ్వాలతో కాంగ్రెస్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే బీజేపీ కూడా అధికారంలో ఉన్నన్న రోజులు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజల్లోకి వెల్లనుంది.
రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఇక్కడా ఏ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉండదనే సాంప్రదాయం ఉంది. దీంతో ఈసారి తమ పార్టీ గెలుస్తుందని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడ వెనుకబడిన తరగతుల ఓట్లో గెలుపొందే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది.
ఛత్తీస్ గఢ్ లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరోసారి రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తమకు అవకాశం ఇస్తే అవినీతిని పారద్రోలుతామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సంస్థ సర్వే ప్రకారరం మరోసారి కాంగ్రెస్ కే అధికారం వస్తుందని తేలింది. అయితే ఓటర్ల నాడి ఎటువైపు ఉందో చూడాలి.
మిజోరాంను దక్కించుకునేందుకు జాతీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానిక పార్టీలదే హవా సాగుతోంది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ , జోరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీలదే నడుస్తుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వరుసగా 5,1 స్థానాల్లో ఉన్నాయి. అయితే మరోసారి స్థానిక పార్టీలకే అధికారం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.