Pawan Kalyan- Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం మామూలే. ఇది గతంలో కూడా జరిగినవే. ప్రస్తుతం కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. డేట్స్ కుదరకపోవడంతో వదులుకున్న సినిమాలు కొన్నైతే నచ్చక వదిలేసిన సినిమాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఒకరికి దక్కాల్సిన మరొకరికి దక్కడం తెలిసిందే. అతడు, పోకిరి సినిమాలు మొదట పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చినా ఆయన కాదనడంతో మహేశ్ బాబు దగ్గరకు చేరాయి. దీంతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.
సీనియర్ నటుడు బాలకృష్ణ కూడా కాదనుకున్న సినిమాలు పవన్ కల్యాణ్ చేయడం విశేషం. భీమ్లా నాయక్ సినిమా మొదట బాలకృష్ణ తో తీయాలనుకున్న కుదరకపోవడంతో పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లింది. ఇంకా బాలయ్య రిజెక్ట్ చేసిన సింహరాశి సినిమా రాజశేఖర్ తీసి హిట్ కొట్టాడు. వకీల్ సాబ్ సినిమాను కూడా ముందుగా బాలయ్యతో తీయాలని దిల్ రాజు ప్లాన్ చేసినా కుదరకపోవడంతో పవన్ కల్యాణ్ తో తీశాడు. ఇలా బాలయ్య వద్దనుకున్న సినిమాలు పవన్ కల్యాణ్ తీసినట్లు తెలుస్తోంది.
అన్నవరం సినిమా కథ కూడా ముందుగా బాలయ్యకే చెప్పినా గతంలోనే చెల్లెలి సెంటిమెంట్ తో ముద్దులమావయ్య తీయడంతో ఒకే రకమైన సినిమాలు అవుతాయని వద్దనుకోవడంతో పవన్ కల్యాణ్ తో తెరకెక్కించారు. నాగవల్లి సినిమాను కూడా బాలయ్యతో తీయాలనుకున్న ఆయన వద్దనడంతో వెంకటేశ్ తో తీశారట. దీంతో బాలయ్య వద్దనుకున్న సినిమాలతో పవన్ కల్యాణ్, వెంకటేశ్ ప్లాప్ లు అందుకుంటే రాజశేఖర్ మాత్రం హిట్ కొట్టి మంచిపేరు తెచ్చుకున్నాడు.
హరిహర వీరమల్లు కూడా క్రిష్ బాలకృష్ణతో తీయాలనుకున్నా ఆయన నో చెప్పడంతో మళ్లీ పవన్ కల్యాణ్ సరే అనడంతో ఆ సినిమా కూడా చిత్రీకరణలో ఉంది. గతంలో దిల్ రాజు సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా అల్లు అర్జున్ తో తీయాలనుకున్నా కుదరకపోవడంతో సాయిధరమ్ తో చేసి హిట్ కొట్టారు. సీనియర్ ఎన్టీఆర్ కు కూడా యమగోల అలా వచ్చిందేనట. అది మొదట శోభన్ బాబుతో ప్లాన్ చేశారట. కానీ మాస్ సినిమా కావడంతో ఆయన వద్దనడంతో ఎన్టీఆర్ తో తీసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇలా సినిమా పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం కామనే. దీంతో అవి కొందరికి హిట్లు అయ్యాయి. మరొకరికి ఫట్టయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇలా పలు సినిమాలు ఒకరి చేతుల్లోకి వెళ్లేవి మరొకరి చేతుల్లోకి వెళ్లి బ్రహ్మాండమైన హిట్లు కావడం తెలిసిందే.