OG movie car number meaning: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎటు వైపు చూసినా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మేనియా నే కనిపిస్తుంది. నేడు ఆయన పుట్టిన రోజు కావడం తో అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ ఇలా ప్రతీ ఒక్కరు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 25 న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) విడుదల అవ్వబోతున్న సందర్భంగా నేడు సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఇంతలోపు కాసేపటి క్రితమే డైరెక్టర్ సుజిత్ ఓజీ చిత్రం నుండి ఒక బ్లాక్ బస్టర్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఓజీ కంటెంట్ తో మెంటలెక్కిపోయిన అభిమానులు, ఈరోజు విడుదల చేసిన పోస్టర్ ని చూసి నరనరాల్లోకి హైప్ ని ఎక్కించుకున్నారు. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే, ఇలా కదా మనం ఆయన్ని చూడాలని అనుకున్నది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ పోస్టర్ ని బాగా గమనిస్తే, కారు క్రింద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. దానిని చూసి అభిమానులు ఒక భారీ ఫైట్ తర్వాత పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవుతూ కారు మీద కూర్చున్న షాట్ లాగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా ఆయన కూర్చున్న కారు నెంబర్ ని కూడా దెట్లింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ కారు నెంబర్ 0893. 08 అంటే ఆగస్టు నెల, 93 అంటే 1993. ఇది పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ లో నటించడానికి సంతకం చేసిన రోజు అంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. డైరెక్టర్ సుజిత్ కి అది తెలుసు కాబట్టే, ఇలా పెట్టాడు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే నేడు విడుదల చేసిన పోస్టర్ లో కనిపించిన షాట్ ఈరోజు సాయంత్రం విడుదల అవ్వబోయే ఓజీ టీజర్ లో కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఒక్క పోస్టర్ ని చూపించి దేశవ్యాప్తంగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ చేయొచ్చు, అలాంటి కటౌట్ పవన్ కళ్యాణ్ సొంతం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి, ఈ పోస్టర్ తో ఆ అంచనాలు ఇంకా రెట్టింపు అయ్యాయి. ఇక టీజర్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని, నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరో లెవెల్ స్పీడ్ కి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 9 లక్షల డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ జరగలేదు. ఇక నేడు విడుదలయ్యే టీజర్ తర్వాత ఈ చిత్రం నార్త్ అమెరికా లో ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు నెటిజెన్స్.