Sivakarthikeyan Sensational Comments: తమిళనాడు లో ప్రస్తుతం స్టార్ హీరో లీగ్ కి అతి చేరువగా ఉన్న మీడియం రేంజ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది శివ కార్తికేయన్(Sivakarthikeyan) మాత్రమే. అంటే మన టాలీవుడ్ కి నేచురల్ స్టార్ నాని ఎలాగో, శివ కార్తికేయన్ కోలీవుడ్ కి అలా అన్నమాట. గత ఏడాది ఆయన అమరన్ చిత్రం తో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలాడు. సుమారుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. సౌత్ లో అనేక మంది స్టార్ హీరోలకు ఈ మాత్రం కూడా ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే లేటెస్ట్ గా ఆయన ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్(AR Murugadoss) దర్శకత్వం లో ‘మదరాసి'(Madrasi Movie) అనే చిత్రం చేశాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మురగదాస్ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ ఆశిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే శివ కార్తికేయన్ తెలుగు సినిమా గొప్పదనం గురించి నిన్న హైదరాబాద్ లో జరిగిన మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవి, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ కి దర్శకత్వం వహించిన మురగదాస్ లాంటి డైరెక్టర్ తో పని చేయడం నాకు ఎంతో సంతోషం గా ఉంది. ఈ సినిమాకు నా ప్రాణ స్నేహితుడు అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు’.
‘ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ప్రసాద్ గురించి ప్రత్యేకించి మాట్లాడాలి. కథలో కంటెంట్ ఉందని నమ్మితే ఆయన ఖర్చు కి అసలు వెనకాడరు. టాలీవుడ్ లో నిర్మాతలందరూ ఇలాగే ఉంటారనుకుంటా. అందుకే ఈ ఇండస్ట్రీ లో వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు అవలీల గా వచ్చేస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి కాబట్టే వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు చాలా తేలికగా వస్తున్నాయి, కానీ తమిళం లో కంటెంట్ లేని సినిమాల కారణంగానే వెయ్యి కోట్లు రావడం లేదా?, శివ కార్తికేయన్ మాటలను ఇలాగే అర్థం చేసుకోవచ్చా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా విడుదలైన కూలీ చిత్రం కూడా కంటెంట్ లేకపోవడం వల్లే వెయ్యి కోట్లు అందుకోలేదా అని కూడా అంటున్నారు. శివ కార్తికేయన్ ఆ వెయ్యి కోట్ల ప్రస్తావన తీసుకొని రాకుండా ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.