https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అమ్మాయిలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని చాలా బాధపడుతున్నారు.

Written By: , Updated On : May 4, 2024 / 02:31 PM IST
Do you know the girls who rejected Prabhas

Do you know the girls who rejected Prabhas

Follow us on

Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ఈయన చేసిన మొదటి సినిమా నుంచి మొన్న చేసిన సలార్ సినిమా వరకు ప్రతి సినిమాలో వైవిధ్యమైన నటన ను కనబరుస్తూ ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనే విధంగా సినిమాలు చేస్తూ చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ లాంటి హీరోని భర్తగా పొందాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు.

మరి ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కెరియర్ పరంగా ప్రభాస్ ఇప్పటికే చాలా టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నప్పటికీ ఆయన పెళ్లి మీద ఫోకస్ చేస్తే అభిమానులు కూడా ఆనందపడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంతవరకు ఎవరిని లవ్ చేయాలేదా అనే విషయాలను తెలుసుకోడానికి అతని అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ సినీ మేధావులను అడుగుతున్నారు.

అయితే సాహో సినిమా సమయంలో ప్రభాస్ తన లవ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని కూడా చేశాడు. అయితే ఆయన మాట్లాడుతూ “తను ఇప్పటివరకు చాలామందికి ప్రపోజ్ చేశారట. కానీ అందులో అందరూ తనని రిజెక్ట్ చేశారని ఆయన ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం అప్పట్లో వైరల్ గా మారింది”. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.

ఇక ఇది చూసిన చాలామంది ప్రభాస్ అభిమానులు ఆయన లాంటి హీరోనే రిజెక్ట్ చేసిన అమ్మాయిలు మనలాంటి వారిని రిజక్ట్ చేయడంలో తప్పేముంది అంటూ అమ్మాయిల ప్రేమని పొందలేని వాళ్లంతా ప్రభాస్ చెప్పిన మాటను తమకు తాము ఓన్ చేసుకొని ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు…