https://oktelugu.com/

Bullet Bhaskar Dubbing Mahesh Babu: మహేష్ సినిమాకు ఆ జబర్ధస్త్ కమెడియన్ డబ్బింగ్ చెప్పాడు?

Bullet Bhaskar Dubbing Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా మాట్లాడతారు. ఆయన సింపుల్ సిటీయే అభిమానులను సంపాదించిపెట్టింది. మహేశ్ బాబు ఇటీవల నటించిన సర్కారు వారి పాట విడుదలై ప్రేక్షకులను రంజింపచేస్తోంది. థియేటర్లలో సందడి చేస్తోంది. మహేశ్ బాబు వాయిస్ ప్రత్యేకంగా ఉండటంతో ఆయన వాయిస్ ఇమిటేట్ చేయడం అంత సులభం కాదు. ఇంతవరకు ఆయన వాయిస్ ను ఎవరు ఇమిటేట్ చేయడం వీలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2022 / 11:03 AM IST
    Follow us on

    Bullet Bhaskar Dubbing Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా మాట్లాడతారు. ఆయన సింపుల్ సిటీయే అభిమానులను సంపాదించిపెట్టింది. మహేశ్ బాబు ఇటీవల నటించిన సర్కారు వారి పాట విడుదలై ప్రేక్షకులను రంజింపచేస్తోంది. థియేటర్లలో సందడి చేస్తోంది. మహేశ్ బాబు వాయిస్ ప్రత్యేకంగా ఉండటంతో ఆయన వాయిస్ ఇమిటేట్ చేయడం అంత సులభం కాదు. ఇంతవరకు ఆయన వాయిస్ ను ఎవరు ఇమిటేట్ చేయడం వీలు కాలేదు కానీ ఆయన వాయిస్ ను ఇమిటేట్ చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడే జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్.

    Bullet Bhaskar, Mahesh Babu

    జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమాకు డబ్బింగ్ చెప్పినట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. జబర్దస్త్ షో ద్వారా తన ఇమేజ్ సంపాదించుకున్న భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేశ్ బాబు వాయిస్ పక్కవారికే వినిపించకుండా ఉంటుంది. రాజకుమారుడు నుంచి ఇప్పటివరకు ఆయన వాయిస్ లో ఎంతో వైవిధ్యం ఉంది.

    Also Read: Bigg Boss Non Stop OTT Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందుమాధవి? ఓటింగ్ లో టాప్ లేపిన ఆడపులి?

    2014లో వచ్చిన నేనొక్కడినే సినిమాకు డబ్బింగ్ తానే చెప్పినట్లు బుల్లెట్ భాస్కర్ చెప్పడం సంచలనం సృష్టించింది. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచుతుడైన భాస్కర్ తన స్కిట్లతో ప్రేక్షకులను మెప్పించడం తెలిసిందే. బుల్లెట్ భాస్కర్ సినిమాలకు, ప్రకటనలకు చెప్పినట్లు ప్రకటించడం షాకింగ్ కు గురి చేస్తోంది. తన షోల్లో కూడా మహేశ్ బాబు వాయిస్ ను ఇమిటేట్ చేయడం తెలిసిందే.

    Bullet Bhaskar, Mahesh Babu

    మహేశ్ బాబు అంతే తనకిష్టమని చెబుతున్నాడు. కానీ ఇంతవరకు ఆయనను కలిసే అవకాశం రాలేదని వివరించాడు. సర్కారు వారి పాటకు కూడా డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా కుదరలేదన్నారు. భాస్కర్ సినిమా పరిశ్రమలోని ఇంకా కొందరి వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఎంఎస్ నారాయణ, కళ్లు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు ల వాయిస్ కూడా ఇమిటేట్ చేసి అలరిస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు వాయిస్ ను అనుకరించడం అంత సులువైన పని కాదని తెలిసినా ఉన్నది ఉన్నట్లు మహేశ్ బాబు వాయిస్ దింపుతున్నట్లు సమాచారం.

    Also Read:Jr NTR Birthday: జూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానుల నీరాజనాలు

    Tags