Gopal Varma And Teja: శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ…అప్పటిదాకా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఒక్కసారి గా చేంజ్ చేసి పడేసిన ఏకైక డైరెక్టర్ వర్మ…
ఇక ఈయన చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి. ఇక శివ సినిమా టైమ్ నుంచే డైరెక్టర్ తేజ రాంగోపాల్ వర్మతో పాటు ట్రావెల్ అవుతూ వచ్చాడు. శివ సినిమాలో కూడా ఆయన స్క్రిప్ట్ పరంగా గా కానీ, పోస్టర్స్ పరంగా కానీ వర్మ కి చాలా సలహాలు, సూచనలు ఇచ్చినట్టుగా చాలా ఇంటర్వ్యూలో తేజ చెప్పాడు. ఇక ఇలాంటి క్రమంలో క్షణక్షణం సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో ఒక సీన్ తీయాల్సి వచ్చినప్పుడు స్వతహాగా కెమెరామెన్ అయిన తేజ ఈ షాట్ ఇలా చేద్దామని చెప్పాడంట.
ఇక దాంతో వర్మ తేజ మీదకి సీరియస్ అయి ‘డైరెక్టర్ నువ్వా నేనా అని అరుస్తూ నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత తొందర పడుతున్నావ్ తేజ అని కొంచెం గట్టిగా మాట్లాడటంతో తేజ అప్సెట్ అయ్యి అక్కడ నుంచి బయటికి వచ్చాడట’…ఇక అప్పట్లో ఈ విషయం మీద చాలా వార్తలైతే వచ్చాయి. ఇంకా అప్పటినుంచి వర్మ దగ్గరికి వెళ్లకుండా తను బయట వేరే సినిమాలు చేస్తూ అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా కూడా చేస్తూ తన కెరీర్ ని ముందుకు సాగించుకుంటూ వచ్చాడు.
ఇక అందులో భాగంగానే 2000 వ సంవత్సరంలో చిత్రం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయినప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చాలా సినిమాలను డైరెక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు రానాని హీరోగా పెట్టి రాక్షస రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని తేజ చూస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తేజ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…