Rajamouli And Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఫస్ట్ టైం వీరి కాంబోలో మూవీ సెట్ అయ్యింది. మహేష్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్ర కథపై ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. మహేష్ ఇమేజ్ కి సెట్ అయ్యేలా జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
ఈ మూవీలో మహేష్ లుక్ సరికొత్తగా ఉంటుందని సమాచారం. రాజమౌళి సూచించిన విధంగా మహేష్ మేకోవర్ కానున్నాడట. మహేష్ యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాదాపు రెండు నుండు మూడేళ్లు మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించనున్నారు. మధ్యలో ఆయన ఎలాంటి సినిమాలు, యాడ్లు చేయడానికి కూడా వీలులేదనే వాదన ఉంది.
కాగా మహేష్-రాజమౌళి మూవీ బడ్జెట్ రూ. 1000 కోట్లు అని అంచనా. నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే ఇంత మొత్తం భరించడం కేఎల్ నారాయణకు అయ్యే పనికాదు. సహ నిర్మాతగా ఒకరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి అవుతారంటూ ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు పార్ట్నర్ అవుతున్నాడని తెలుస్తుంది.
మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా ఉంటారట. అందుకు గాను రెమ్యూనరేషన్ ఒక్క రూపాయి తీసుకోవడం లేదట. తన పారితోషికాన్ని చిత్ర నిర్మాణంలో పెడుతున్నారట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. గతంలో కూడా మహేష్ బాబు తాను హీరోగా నటించిన పలు చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మహేష్ బాబుకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఇతర హీరోలతో కూడా చిత్రాలు చేస్తున్నారు. అడివి శేష్ హీరోగా మేజర్ చిత్రాన్ని మహేష్ నిర్మించాడు.