Jailer Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి వచ్చిన జైలర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తుంది. సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. త్వరలోనే 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. కేవలం ఒక్క సాంగ్ రెండు మూడు సీన్స్ లో నటించిన తమన్నా కు కూడా మంచి పేరు వచ్చింది. ఇదే సినిమాలో ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్ కొడుకు కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నాడు.
జైలర్ సినిమాలో సునీల్ నటించిన విషయం తెలిసిందే, ఇందులో సినిమా హీరోగా కనిపించారు. ఇందులో సునీల్ ని డైరెక్ట్ చేసే పాత్రలో కోదండరామి రెడ్డి పెద్ద కొడుకు సునీల్ రెడ్డి నటించారు. సునీల్ తో పాటు ఎక్కువగా కనిపిస్తూ తమన్నా లవర్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. తనదైన టైమింగ్ తో కామెడీ పండించాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మర్చిపోలేని సూపర్ హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి కొడుకు కమెడియన్ గా నటించడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.
చిరంజీవి తో ఖైదీ, పసివాడి ప్రాణం, ఛాలెంజ్, అభిలాష, విజేత, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి హిట్స్ తీసిన కోదండరామిరెడ్డి కొడుకు ను హీరోగా మాత్రం నిలబెట్టలేకపోయాడు. సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన కానీ మెప్పించలేకపోయాడు. తమ్ముడు హీరోగా నటిస్తున్న సమయంలో సునీల్ రెడ్డి కమెడియన్ గా నటించడం మొదలు పెట్టాడు. గతంలో వచ్చిన డాక్టర్ మూవీ సునీల్ రెడ్డి పాత్రకు కూడా మంచి అప్లాజ్ వచ్చింది.
జైలర్ సినిమాలో సునీల్ రెడ్డిని చూస్తున్నప్పుడు చాలా మందికి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎవరు అని ఆరా తీస్తే మన కోదండరామిరెడ్డి కొడుకు అని తెలిసింది. ప్రస్తుతం తమిళంలో మంచి ప్రామిసింగ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్ రెడ్డి. ఒక తెలుగు దర్శకుడి కొడుకు తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.