https://oktelugu.com/

Viral Video: చెల్లి సితారకు పోటీగా రంగంలోకి దిగిన అక్క… ఆమె దెబ్బకు సోషల్ మీడియా షేక్

మహేష్ బాబు పాటలకు డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇటీవల గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ, ధూమ్ మసాలా సాంగ్స్ కి సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 21, 2024 / 12:16 PM IST
    Follow us on

    Viral Video: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తో సితార ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. సితారకు ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. రీల్స్, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులను ఫిదా చేస్తుంది.

    ముఖ్యంగా మహేష్ బాబు పాటలకు డాన్స్ అదరగొట్టేస్తుంది. ఇటీవల గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ, ధూమ్ మసాలా సాంగ్స్ కి సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ వీడియోలు మిలియన్స్ కొద్ది వ్యూస్ రాబట్టాయి. అతి చిన్న వయసులో ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా మారి, స్టార్ కిడ్ గా రికార్డు సొంతం చేసుకుంది. సితార ఎదుగుతున్న తీరు చూసి తండ్రికి తగ్గ తనయ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

    అయితే ఇప్పుడు సితార కు పోటీగా మరో ఘట్టమనేని వారసురాలు తయారైంది. మహేష్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని సోషల్ మీడియా లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ కు ఇద్దరు కుమారులు.పెద్దబ్బాయి రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. రమేష్ బాబుకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి పేరు భారతి. తాజాగా గుంటూరు కారం చిత్రం లోని కుర్చీ మడతపెట్టి పాటకు భారతి స్టెప్స్ వేసింది.

    మాస్ మూమెంట్స్ డాన్స్ ఇరగదీసింది. ప్రొఫెషనల్ డాన్సర్ ని తలపించేలా హుక్ స్టెప్స్ వేసింది. వీడియో చూసిన వారు సితారకు గట్టి పోటీ ఇస్తుంది భారతి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సితారకు నటన పట్ల ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో సినీ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ద్వారా సితార భారీగా సంపాదిస్తుందని టాక్.