Top Heroines Mistakes: తెలుగు సినిమాల్లో అనతి కాలంలోనే అగ్రహీరోయిన్ గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. మొదటి సినిమా నువ్వు నాకు నచ్చావ్ విజయవంతం కావడంతో ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశాలే తలుపు తట్టాయి. దీంతో ఆమె కూడా అగ్రహీరోలతోనే జత కట్టింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి వారితోనే కాకుండా కుర్ర హీరోలతో కూడా నటించింది. దీంతో ఆమె ప్రస్థానం మూడు సినిమాలు ఆరు హిట్లు అన్నట్లుగా సాగింది. కొద్ది కాలంలోనే తన నటనతో అభిమానులను సంపాదించుకుంది.

కెరీర్ మంచి ఊపులో ఉండగానే ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం నడిపింది. ఆర్తి కుర్ర హీరోలతో కాకుండా పెద్ద హీరోలతోనే వరుస సినిమాలు చేయడంతో చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు. దీనికి తోడు కుర్ర హీరోతో లవ్ కూడా ఆమె కెరీర్ ను దెబ్బతీసింది. దీంతో ఆమెకు సినిమాలు తగ్గాయి. కెరీర్ అంధకారంగా మారడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఉప్పెనతో పరిశ్రమకు పరిచయమైన కుర్ర హీరోయిన్ కృతి శెట్టి కూడా అదే బాటలో నడుస్తోంది. ఉప్పెనతో పాటు మరో రెండు సినిమాలు హిట్లు సాధించడంతో ఈ భామ హుషారుగా సినిమాలు చేస్తోంది.
Also Read: Superstar Krishna: నరేష్ నాల్గవ పెళ్లి పై విరుచుకుపడిన సూపర్ స్టార్ కృష్ణ
మరోవైపు ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది. దీంతో ఈమెకు కూడా ఆర్తి అగర్వాల్ పరిస్థితి వస్తుందో ఏమో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ భామ కెరీర్ ను మలుచుకునే క్రమంలో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలుగులో రామ్, నితిన్ సరసన రెండు సినిమాలు చేసింది. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా ఆమెకు ప్లస్ అయ్యే సినిమాలే. దీంతో కృతి శెట్టి రెండు చేతులా సంపాదిస్తోంది.

యంగ్ హీరోతో ప్రేమలో పడటంతో ఆమెకు ఆర్తి అగర్వాల్ కు దగ్గర పోలికలు ఉన్నాయని పరిశ్రమ వర్గాల వాదన. ఆర్తి అగర్వాల్ కూడా అనతి కాలంలోనే మంచి బ్రహ్మాండమైన హిట్లతో కెరీర్ ను ప్రారంభించి చివరకు తన జీవితాన్ని ముగించింది. ఇప్పుడు కృతి శెట్టి కూడా అలాగే ప్రేమలో పడి తన కెరీర్ కు ఎక్కడ విఘాతం తెచ్చుకుంటుందో అని ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కెరీర్ బాగుండగానే నాలుగు సినిమాలు చేసుకుని సంపాదించుకోవాలి. కానీ ఇలా ప్రేమ, దోమ అంటే వారి కెరీర్ కే మచ్చ వస్తుందని పరిశ్రమ వర్గాల భోగట్టా. మొత్తానికి కృతిశెట్టి భవితవ్యం ఎటు వైపు వెళ్తుందో చెప్పలేం.
Also Read:Thank You Trailer Talk : మొదలైన ప్రేమకథ చేరే గమ్యమే ‘థ్యాంక్ యూ’
[…] […]