Superstar Krishna: గత కొద్ది రోజుల నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు ప్రముఖ సీనియర్ నటుడు నరేష్..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల సమయం లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో కొట్లాటకు కూడా దిగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి..ఆ వీడియోలు ఇప్పటికి మనం యూట్యూబ్ లో చూడవచ్చు..ఇక మా ఎన్నికలు అయిపోయాయి అంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్న సమయం లో ఇటీవల ఆయన ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ని నాల్గవ పెళ్లి చేసుకోబోతున్న వ్యవహారం పెద్ద వివాదాలకు దారి తీసింది..నరేష్ మూడవ భార్య రమ్య మీడియా కి వచ్చి నరేష్ పై ఆరోపణలు చెయ్యడం ఆ తర్వాత నరేష్ దానికి కౌంటర్లు ఇవ్వడం , ఇలా ఇప్పటికి వీరి వివాద వ్యవహారం మీడియా లో కొనసాగుతూనే ఉంది..రమ్య అయితే ఇటీవల నరేష్ – పవిత్ర లోకేష్ బెంగళూరు లో నివాసం ఉంటున్న ఒక హోటల్ రూమ్ కి వెళ్లి ఇద్దరినీ చెప్పుతో కొట్టబోయింది ..అక్కడ ఉన్న పోలీసులు ఆమెని అదుపు చెయ్యడం వల్ల పరిస్థితులు శాంతించాయి కానీ లేకపోతే ఆరోజు పెద్ద గొడవే జరిగేది..దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇలా నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉన్న ఈ వివాదం ని చూసి సూపర్ స్టార్ కృష్ణ నరేష్ పై ఫైర్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..నరేష్ కృష్ణ ఫామిలీ కి చెందిన వాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..కృష్ణ గారి సతీమణి స్వర్గీయ విజయనిర్మల గారి కుమారుడే నరేష్..ఆమె చనిపోయిన తర్వార కృష్ణ కి కుడి భుజం లాగ మారి ఆయన సంబంధించిన పనులన్నీ నరేష్ గారే దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు.
Also Read: NTR- Nitin Narne: అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ బావమరిది స్టార్ట్ చేస్తాడట
అయితే ఇప్పుడు జరుగుతున్నఈ వ్యవహారం మొత్తం ఘట్టమనేని ఫామిలీ కుటుంబం పరువు తీసేలా ఉందని..వివాదాలకు దూరంగా ఉండే మా కుటుంబం పరువు తియ్యొదు, ఇక నుండి ఎలాంటి వీడియో బైట్స్ కానీ, ప్రెస్ మీట్లు కానీ పెట్టొద్దు అంటూ కృష్ణ గారు నరేష్ ని గట్టిగ మందలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అందుకే తన నాల్గవ పెళ్లి వివాదం గురించి ఈమధ్య కాలం లో మానేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:The Warrior Movie First Review: ది వారియర్’ మొట్టమొదటి రివ్యూ