Bigg Boss Season 6 Adi Reddy: తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. తొలి రోజు నుంచి ఇందులో గొడవలు మొదలయ్యాయి. ఈసారి సినీ, టీవీ, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారికి అవకాశం కల్పించారు. బిగ్ బాస్ 6లో సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు.
బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టాడు యూట్యూబర్ ‘ఆదిరెడ్డి’. సన్నగా.. పొడుగ్గా ఉన్న ఇతడు గలగలా మాట్లాడుతూ యూట్యూబ్ లో ‘బిగ్ బాస్ రివ్యూలు’ చెప్పి ఫేమస్ అయ్యాడట.. కేవలం బిగ్ బాస్ ద్వారానే ఈ స్థాయికి చేరిన అతడు.. అందులోనే కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకోవడం విశేషం.
బిగ్ బాస్ 17వ కంటెస్టెంట్ గా నెల్లూరు జిల్లాకు చెందిన కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ప్రవేశించాడు. ఆదిరెడ్డిది నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు అనే గ్రామం. నెల్లూరులో పేద కుటుంబం.. కష్టాల మధ్య పెరిగిన ఆదిరెడ్డి బిగ్ బాస్ తోనే ఫేమస్ అవ్వడం విశేషం. ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి నెల్లూరులో డిగ్రీ చదివుతుండగా మధ్యలో ఆపేసి ఆ తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లిన ఆదిరెడ్డి ఆ సమయంలో స్నేహితుడి ప్రోత్సాహంతో బిగ్ బాస్ సీజన్ 2 నుంచి బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం ప్రారంభించాడు. ఈ వీడియోలకు మంచి ఆదరణ రావడం.. నెలకు రూ.2లక్షల వరకూ ఆదాయం రావడంతో ఇక సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి బిగ్ బాస్ రివ్యూలతోనే బతకడం ప్రారంభించాడు.
ఇతడు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. ఆది రెడ్డిని ‘గుడాల్ మామ’ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. యూట్యూబ్ లో నెలకు రూ.2 లక్షలు సంపాదించే వరకూ ఎదిగాడు. ఈ మధ్య జనసేన కౌలు రైతులకు లక్ష రూపాయల విరాళం ఇచ్చి తమ ఊదారత చాటుకున్నారు. యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పి తన పేదరికాన్ని జయించిన ఆదిరెడ్డి అదే షోలోకి 17వ కంటెస్టెంట్ గా ప్రవేశించడం విశేషం.