Man Earns Sleeping: సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన జాకీ బోమ్ ఇప్పుడు నిద్రపోతూ సంపాదిస్తున్నాడు. ఇదొక కొత్త ఉద్యోగమనే చెప్పాలి. ఎందుకంటే ఇలా నిద్రతో కూడా సంపాదిస్తున్న ఇతడి తెలివిని చూసి అందరూ ఔరా అంటున్నారు. జాకీ బోమ్ తాను నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎలానో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

జాకీబోమ్ నిద్రపోతున్న సమయంలో ఎవరైనా సరే అతడిని నిద్రలేపవచ్చు. ఇదో గేమ్ అన్నమాట.. అలా ఎవరైనా సరే నిద్రలేపితే.. అలా లేపినందుకు డబ్బు ఇవ్వాలి. ఈ గేమ్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో ఇప్పుడు జాకీ బోమ్ నిద్ర చెడగొట్టేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. అతడిని నిద్రలేపుతూ ఈ గేమ్ ఆడుతున్నారు. అతడిని డిస్ట్రబ్ చేస్తూ డబ్బు ఇస్తున్నారు.
జాకీబోమ్ తనను నిద్రలేపేందుకు టెక్నికల్ గా ఆన్ లైన్ లో పనిచేసే లేజర్లు, స్పీకర్లు, బబుల్ మెషీన్ , అలాంటి లాంటి ఎలక్ట్రిక్ పరికరాలు పెట్టుకున్నాడు. జాకీ రోజూ రాత్రి 11 గంటలకు నిద్రపోతాడు. అప్పటి నుంచి ఈ పరికరాలన్నీ లైవ్ స్ట్రీమ్ లో పెడుతాడు. తను పడుకున్నది లైవ్ వీడియో చేస్తాడు. ప్రపంచంలో ఎవరైనా సరే లైవ్ చూసి అతడిని నిద్రలేపాలి. అలా లేపినందుకు అతడికి డబ్బులు ఇవ్వాలి.
లైవ్ లో చూసి అతడి రూమ్ లోని ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ చేయాలన్నమాట.. అలా ఆన్ చేయగానే వాటి సౌండ్ కు జాకీ లేచి కూర్చుంటాడు. ఇలా అతడు నిద్రపోతూనే లేస్తూ సంపాదిస్తున్నాడు.

28 ఏళ్ల జాకీకి రోజు 7 గంటలు నిద్రపోవడం ఇష్టం. కానీ ఈ గేమ్ తో అతడికి సంపాదన బాగా వస్తున్నా నిద్ర మాత్రం పోతోంది. అది అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
Also Read:Hellenistic Houses: 2200 సంవత్సరాలుగా నరకానికి ప్రవేశ ద్వారం ఇదీ