Site icon OkTelugu

Animal Park Movie: ‘యానిమల్ పార్క్’ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో.. సందీప్ వంగ ప్లాన్ మామూలుగా లేదుగా!

Animal Park Movie

Animal Park Movie

Animal Park Movie: 2023 వ సంవత్సరం లో సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga), రణబీర్ కపూర్(Ranbir Kapoor) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘యానిమల్'(Animal Movie) చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాని సందీప్ వంగ తీర్చి దిద్దిన తీరుని చూసి బాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. మనిషిలో ఉన్న బోల్డ్ ఆలోచనలను, ఇంత ఓపెన్ గా సినిమా రూపం లో చెప్పొచ్చా?, అంటూ ప్రేక్షకులు, విమర్శకులు నివ్వెరపోయారు. కొంతమంది ఈ చిత్రాన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విమర్శకులను తట్టుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే సాధారణమైన విషయం కాదు. ఇక నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎగబడి చూసారు, నెలల తరబడి టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. అయితే ఈ సినిమా సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కానీ అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం అందరిలో ఉండేది. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సందీప్ వంగ ఈ సీక్వెల్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘స్పిరిట్’ చిత్రం పూర్తి అవ్వగానే, ‘యానిమల్ పార్క్’ ని మొదలు పెడతానని, చాలా మంది ఈ సినిమాని సందీప్ వంగ వదిలేసాడని అంటూ ఉన్నారని, ఈ సినిమాని వదిలే సమస్యే లేదని, ‘యానిమల్’ అనేది ఒక సినిమా కాదని, పెద్ద యూనివర్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ‘యానిమల్ పార్క్’ చిత్రం వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాని సందీప్ వంగ చాలా భారీ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఒక పాత్ర పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ లో కనిపించనుంది, ‘యానిమల్’ క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనేది మీరంతా చూసే ఉంటారు.

ఇకపోతే ఈ చిత్రం లో మన టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఆయన క్యారెక్టర్ మూవీ క్లైమాక్స్ లో వస్తుందట. ఈ క్యారెక్టర్ పాజిటివ్ గా ఉంటుందా?, లేదా నెగటివ్ గా ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సందీప్ రెడ్డి సినీ కెరీర్ విజయ్ దేవరకొండ తోనే మొదలైంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఒక పాత్ బ్రేకింగ్ సినిమా. ఇదే చిత్రాన్ని ఆయన బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో ;’కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. తన కెరీర్ ని టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్థాయికి వెళ్లేందుకు కారణమైన విజయ్ దేవరకొండ కి, కచ్చితంగా హిస్టరీలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు నెటిజెన్స్.

Exit mobile version