spot_img
Homeఎంటర్టైన్మెంట్Attitude Star Chandrahas: 'మృణాల్ ఠాకూర్ తో డేట్ చేస్తా..శ్రీలీల ని పెళ్లి చేసుకుంటా' అంటూ...

Attitude Star Chandrahas: ‘మృణాల్ ఠాకూర్ తో డేట్ చేస్తా..శ్రీలీల ని పెళ్లి చేసుకుంటా’ అంటూ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హాట్ కామెంట్స్!

Attitude Star Chandrahas: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Attitude Star Chandrahass) పేరే వినిపిస్తుంది. ఈయన మరెవరో కాదు, బుల్లితెర మెగాస్టార్ అంటూ పిలవబడే ప్రభాకర్ కొడుకు. పెద్ద పెద్ద స్టార్ హీరోల కొడుకులు కూడా మీడియా తో మాట్లాడేటప్పుడు చాలా గౌరవం తో మాట్లాడుతుంటారు. అదే విధంగా స్టేజి పై అభిమానుల మీద ప్రేమతో, గౌరవం తో వళ్ళు దగ్గర పెట్టుకొని మరీ మాట్లాడుతుంటారు. కానీ ఈ చంద్ర హాస్ నోటికి అదుపు లేదు, ఇతనికి సంస్కారం అనేది లేదని ఇటీవలే తెలిసింది. ఆయన హీరో గా నటించిన ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీ త్వరలో విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈయన పాడిన ఒక బూతు పాట సభ్య సమాజం తలదించుకునే చేసింది. తన గురించి అందరూ మాట్లాడుకోవాలని ఎంతకైనా దిగజారతారా?, వీళ్ళేమి మనుషులు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ యాటిట్యూడ్ స్టార్ రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన హీరోయిన్ శ్రీలీల పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మీరు ఏ హీరోయిన్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, చంద్రహాస్ సమాధానం చెప్తూ, శ్రీలీలతో కలిసి నటించాలని అనుకుంటున్నాను, నేను ఆమె కలిసి డ్యాన్స్ వేస్తే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శ్రీలీల కంటే నేనే బాగా డ్యాన్స్ చేస్తాను అనే అర్థం వచ్చేలా లాగా కూడా ఇతను మాట్లాడాడు. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఇతని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, స్థాయికి మించి మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడుతున్నారు.

అంతే కాకుండా ఇతన్ని అడిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ రౌండ్ లో, మీకు అవకాశం వస్తే ఎవరితో డేట్ చేస్తారు, ఎవరి పెళ్లి చేసుకుంటారు? అని యాంకర్ అడగ్గా, దానికి చంద్రహాస్ సమాధానం చెప్తూ ‘మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తాను, శ్రీలీల ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన ‘బారాబర్ ప్రేమిస్తా’ సినిమా విషయానికి వస్తే, ఇందులో హీరోయిన్ గా మేఘన ముఖర్జీ నటించింది. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ పథకం పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సంపత్ రుద్రా అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఆదిలాబాద్ లోని రుద్రారం అనే గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతుంటాయి. ఆ రెండు వర్గాలకు చెందిన ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు, ఆ తర్వాత జరిగిన సంఘటనలే సినిమా.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version