https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ని నిజంగానే వీపు పగిలేలా కొట్టిన నటుడు, డార్లింగ్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

ప్రభాస్ సినిమా అంటే భారీ ఫైట్స్ గ్యారంటీ. ఆయన కట్ అవుట్ కి సెట్ అయ్యేలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తారు దర్శకులు. కాగా ఓ ఫైట్ సీన్ లో ప్రభాస్ ని నిజంగా కొట్టాడట ఒక నటుడు. కర్రతో బాదడంతో వీపు పగిలింత పనైందట. ఇంతకీ ఎవరా నటుడు? ఆ చిత్రం ఏమిటో తెలుసా?

Written By:
  • S Reddy
  • , Updated On : January 11, 2025 / 01:00 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: కట్ అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్… మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ , ఆయనకు బాగా సూట్ అవుతుంది. ఆరడుగుల భారీ కాయంతో ఉండే ప్రభాస్ గుద్దితే , రౌడీలు గాల్లోకి ఎగురుతారు. ప్రభాస్ ఆహార్యం చూస్తే… అవన్నీ నమ్మాలి అనిపిస్తుంది. ప్రభాస్ నుండి ఫ్యాన్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోరుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం దర్శకులు ఓ రేంజ్ లో ఉండే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తారు. ఇక ప్రభాస్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఛత్రపతి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఛత్రపతి చిత్రంతో ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు.

    కాగా ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ తో ఫైట్ సీన్ మేజర్ హైలెట్. బాజీరావ్ మనిషిగా కాట్రాజ్ పోర్ట్ లో అరాచకాలు సాగిస్తూ ఉంటాడు. వాడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఒక బాలుడు కోసం శివాజీ కాట్రాజ్ తో తలపడతాడు. శివాజీ పాత్ర ప్రభాస్ చేయగా, కాట్రాజ్ రోల్ లో సుప్రీత్ రెడ్డి నటించాడు. సుప్రీత్ ప్రభాస్ కి మించిన భారీకాయుడు. వీరిద్దరూ తలపడితే సమ ఉజ్జీల ఫైట్ వలె ఉంటుంది. అసలు నిజంగా కొట్టుకుంటున్నారా? అనేంత సహజంగా రాజమౌళి ఆ ఫైట్ చిత్రీకరించారు.

    ఆర్ రవీంద్ర రాజమౌళి మెచ్చిన ఆర్ట్ డైరెక్టర్. రాజమౌళితో ఆయన చాలా కాలం ట్రావెల్ చేశాడు. శివాజీ-కాట్రాజ్ ఫైట్ లో ప్రభాస్ ని సుప్రీత్ ఒక కర్రతో వీపుపై బలంగా కొడతాడు. అప్పుడు దాదాపు నిజంగా కొట్టినంత పనైందట. ప్రభాస్ వీపు విమానం మోత మోగిందట. కారణం.. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర దాదాపు కర్రలా ఉండేలా దాన్ని రూపొందించాడట.

    ఇక సెట్స్ లో ప్రభాస్.. రవి నువ్వు దాన్ని నిజం కర్రలా తయారు చేశావు. దాంతో కొడితే నాకు బాగా దెబ్బలు తగిలాయని, అన్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఛత్రపతి సినిమాతో సుప్రీత్ టాలీవుడ్ లో సెట్టిల్ అయ్యాడు. గతంలో ఆయన జానీ, ఆంధ్రావాలా, సై చిత్రాల్లో చేశాడు.