https://oktelugu.com/

Deepika Padukone: స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానిది…ఏకంగా 10 ,200 కోట్లు రాబట్టిన ఏకైక హీరోయిన్…ఎవరో ఊహించగలరా…

బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ హీరోలందరూ కలిసి 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టిన కూడా పదివేల కోట్లు అందుకోలేకపోయారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం పదివేల కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఆమె బాక్సాఫీస్ క్వీన్ గా రాణిస్తుంది.

Written By:
  • Mahi
  • , Updated On : January 11, 2025 / 01:14 PM IST

    Deepika Padukone

    Follow us on

    Deepika Padukone: గత కొన్ని ఏళ్ల నుంచి సౌత్ సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్లు వసూళ్లు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రెబల్ స్టార్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్, రిషబ్ శెట్టి వంటి సౌత్ సినిమా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అలాగే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ నటించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టాయి. అయితే ఈ హీరోలందరూ కలిసి 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టిన కూడా పదివేల కోట్లు అందుకోలేకపోయారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం పదివేల కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఆమె బాక్సాఫీస్ క్వీన్ గా రాణిస్తుంది. గత దశాబ్దం నుంచి ఆమె హిట్ సినిమాలలో నటించడమే కాకుండా అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు దీపికా పదుకొనే. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు కావస్తుంది. ఆమె 18 సంవత్సరాల సినిమా కెరీర్ లో ఆమె నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.10,200 కోట్లు రాబట్టాయి. ఇందులో భారతీయ సినిమాల నుంచి రూ.8000 కోట్లు మరియు హాలీవుడ్ సినిమాల నుంచి రూ.2000 కోట్లు ఉన్నాయని సమాచారం.

    ఈమె ఇప్పటివరకు హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సినిమాలలో గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా దీపికా పదుకొనే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. గత రెండేళ్లలో దీపికా పదుకొనే పఠాన్, జవాన్, కల్కి వంటి సినిమాలలో నటించింది.

    ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినవే. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 6000 కోట్లు, కత్రినా కైఫ్ 5500 కోట్లు రాబట్టిన సినిమాలలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ 9000 కోట్లు, అక్షయ్ కుమార్ 8300 కోట్లు సాధించిన సినిమాలలో నటించారు. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న దీపికా పదుకొనె ఇటీవలే ఒక పండంటి పాప కు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం దీపికా మరొక సినిమా ప్రకటన చేయకుండా తన పాప తో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది.