Raghavendra Rao: డైరెక్టర్ కే రాఘవేంద్రరావు టాలీవుడ్ బడా దర్శకుల్లో ఒకరు. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ చిత్రాల దర్శకుడు. మూడు తరాల హీరోలతో ఆయన పని చేశారు. బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాల్లో శృంగారరసం కొంచెం ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా పాటల్లో హీరోయిన్స్ నడుము, నాభి చూపడం ఆయనకు ఇష్టం. అంతటితో ఆగడు. నీళ్లలో స్నానాలు చేయిస్తాడు. బొడ్డుపై అనేక రకాల పండ్లు విసురుతాడు. పక్షులు, చేపలతో చక్కిలిగింతలు పెట్టిస్తాడు. రాఘవేంద్రరావు క్వాలిఫికేషన్ గా ఉన్న బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాదని, బొడ్డు మీద ఆపిల్ అన్నంతగా ఆయన పాప్యులర్ అయ్యాడు.
ఝుమ్మందినాదం మూవీలో హీరోయిన్ గా నటించిన తాప్సీ ఇదే విషయమై దర్శకుడు రాఘవేంద్రరావుపై విమర్శల దాడి చేసింది. నా బొడ్డు మీద కొబ్బరి చిప్పల నుండి, పళ్ళు, పూలు విసిరారు. ఇంకా నయం గుమ్మడికాయ విసరలేదు.. అని ఎగతాళిగా ఆమె మాట్లాడింది. అయితే నాలుగు దశాబ్దాల క్రితమే ఈ కారణంగా రాఘవేంద్రరావు మూవీని ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట.
దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత కే మురారి ఓ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నారట. కృష్ణంరాజును హీరోగా అనుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించాల్సి ఉంది. ఒకరు శ్రీదేవి, మరొకరు రాధిక. మూడో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామను అనుకున్నారట. ఈ మేరకు ఓ స్టార్ హీరోయిన్ ని సంప్రదించారట. రాఘవేంద్రరావు హీరోయిన్స్ ని అసభ్యంగా చూపిస్తాడు. నేను ఆయన మూవీలో నటించను అని ఆమె చెప్పారట.
దాంతో ఆ పాత్రకు జయసుధను తీసుకున్నారట. 1982లో విడుదలైన ఆ చిత్రం త్రిశూలం. కృష్ణంరాజు కెరీర్లో భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ స్మిత పాటిల్ అట. ఆమె చేయాల్సిన డీగ్లామర్ రోల్ జయసుధ చేయగా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలోని ‘రాయిని ఆడది చేసిన రాముడివా…’ సాంగ్ చాలా ఫేమస్. అదన్నమాట సంగతి.