https://oktelugu.com/

SaReGaMaPa Singer Parvathi: ‘సరిగమప’ సింగర్ పార్వతి బయోగ్రఫీ తెలుసా..?

SaReGaMaPa Singer Parvathi: సింగర్ పార్వతి.. గత కొన్ని రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇటీవల ఓ టీవీ షోలో ఆమె పాడిన పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రసారమై వైరల్ అయ్యింది. ఈ షోకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పార్వతి తన పాటలతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇప్పటికే ఆమెకు కోట్లాది మంది అభిమానులయ్యారు. పార్వతి ఎవరు..? ఆమె ఎక్కడి […]

Written By: NARESH, Updated On : March 3, 2022 5:26 pm
Follow us on

SaReGaMaPa Singer Parvathi: సింగర్ పార్వతి.. గత కొన్ని రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇటీవల ఓ టీవీ షోలో ఆమె పాడిన పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రసారమై వైరల్ అయ్యింది. ఈ షోకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పార్వతి తన పాటలతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇప్పటికే ఆమెకు కోట్లాది మంది అభిమానులయ్యారు. పార్వతి ఎవరు..? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు..? అని ప్రేక్షకులు విపరీతంగా ఆరాతీస్తున్నారు.

SaReGaMaPa Singer Parvathi

పార్వతిది చాలా సాధారణ కుటుంబం. కర్నూలు జిల్లాలోని డోన్ మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు, లక్ష్మమ్మల కూతురు పార్వతి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో అందరికంటే చిన్నది పార్వతి. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన పార్వతికి చిన్నప్పటి నుంచి పాటలంటే బాగా ఇష్టం. దీంతో ఆమె స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా పాట పాడింది. దీంతో ఆమె గొంతు విన్న ఉపాధ్యాయులు ఆమె మంచి సింగర్ అవుతుందని అభినందించారు. ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన పార్వతి అప్పుడప్పుడు పాటలు పాడేది. ఆమెను ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రోత్సహించేవారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఓ ఏడాది పాటు ఆమె ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. తన అన్నదమ్ములు పడుతున్న కష్టాన్ని చూడలేక పార్వతి కూడా పొలం పనులకు వెళ్లేది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్ – కేజీఎఫ్‌ 2’ ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ?

ఒకరోజు పార్వతి తన ఇంట్లో పాట పాడుతుండగా.. పలుకూరు గ్రామానికి చెందిన ఓ హార్మోనిస్టు ఈమె గొంతు బాగుందని, పాటలు పాడిస్తే సింగర్ అవుతుందని ఆమె అన్నయ్యతో చెప్పాడు. దీంతో పార్వతి అన్నయ్య తిరుపతి సంగీత కళాశాలలో పార్వతిని చేర్పించాడు. అలా 2017లో సంగీత కళాశాలలో చేరింది పార్వతి. గతేడాది డిసెంబర్ 9న ఎస్వీబీసీలో ‘అదిగో అల్లదిగో’ సాంగ్ ను పాడింది. అలాగే అన్యమయ్య గీతం ‘ఏమీ చేయవచ్చునే’ అనే పాట పాడడంతో అక్కడికి జడ్జిగా వచ్చిన ఎస్సీ శైలజ గుర్తించి పార్వతిని ప్రోత్సహించింది. సరిగమప షోతో పార్వతి ప్రతిభ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.

Saregamapa Singer Parvathy

ఇక పార్వతి పాటతో ఏపీ ప్రభుత్వాన్ని కదిలించి తన ఊరికి బస్సును తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 14న సరిగమప చానెల్ కార్యక్రమంలో ‘ఊరంత వెన్నెల మనసంతా చీకటి’ అనే పాటను పార్వతి పాడారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ‘నీకు ఏం కావాలో కోరుకో..’ అని అడగ్గా.. ‘మా గ్రామానికి బస్సు వేయించండి’ అని ఆవేదనతో అడిగింది. దీంతో మంత్రి పేర్ని నానితో మాట్లాడి పార్వతి గ్రామానికి బస్సు వచ్చేలా చేశారు మరో జడ్జి స్మిత.. ఇందుకు సహకరించిన అందరికీ పార్వతి కృతజ్జతలు తెలిపింది. తాజాగా ఆమె జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమప ప్రొగ్రాంలో అమెరికన్ ప్రవాస సింగర్ ప్రణయ్ తో కలిసి పార్వతి పాడిన డ్యూయెట్ సాంగ్ వైరల్ అయ్యింది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, హీరో కార్తికేయలు తమ సినిమాల్లో పార్వతికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో పార్వతి పాడిన పాటకు జడ్జిలు ఫిదా అయ్యారు. పార్వతి ప్రతిభ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. పాటే ఆమె భవిష్యత్తుకు ఇప్పుడు దారి చూపింది. ఆమెకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టింది.

Also Read:  ‘వేణు ఉడుగుల’ వ్యభిచార కూపంలో ‘రాశి ఖన్నా’

Recommended Video:

Tags