Nandamuri Balakrishna: బాలయ్యతో కాలేజీ ఎమోషనల్ డ్రామా.. వర్కౌట్ అవుతుందా ?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తూ జోరుమీద ఉన్నాడు. డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్యకు ఓ కథను సంపత్ వినిపించాడనే ప్రచారం జరుగుతుండగా.. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ వద్దకు దర్శకుడిని పంపినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. నిజానికి బాలయ్యతో మరో సినిమా చేయాలని సి.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ ఎప్పటి నుండో ప్రయత్నాలు […]

Written By: Raghava Rao Gara, Updated On : March 27, 2022 10:28 am
Follow us on

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తూ జోరుమీద ఉన్నాడు. డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్యకు ఓ కథను సంపత్ వినిపించాడనే ప్రచారం జరుగుతుండగా.. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ వద్దకు దర్శకుడిని పంపినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

Nandamuri Balakrishna

నిజానికి బాలయ్యతో మరో సినిమా చేయాలని సి.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా మొదట.. బాలయ్య – సంపత్ నంది కాంబినేషన్ ను కలిపింది ఆయనే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అలాగే, బాలయ్య వైపు నుంచి కూడా చిన్నపాటి అహం అడ్డు వచ్చి సి.కళ్యాణ్ కి డేట్స్ ఇవ్వలేదు.

Also Read:  ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ యేనా? ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు?

దీనికి తోడు సి కళ్యాణ్ సిన్సియర్ ప్రొడ్యూసర్ కాదు. అందుకే, బాలయ్య కూడా ఈ సినిమాని పక్కన పెట్టాడు. అయితే, బాలయ్యతో సినిమా చేయాలని ఆశ పడిన సంపత్ నంది.. మొత్తానికి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని కలిశాడు. కత విన్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఆయనకు కథ బాగా నచ్చింది. వెంటనే బాలయ్యకి ఫోన్ చేసి ఈ సినిమా తాను నిర్మిస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో బాలయ్య ఓకే చెప్పారు.

Nandamuri Balakrishna

ఆ రకంగా సంపత్ నంది – బాలయ్య కలయిక సెట్ అయ్యింది. కాగా బాలయ్యతో మంచి ఎమోషనల్ డ్రామాను కాలేజీ నేపథ్యంలో చేయాలని దర్శకుడు సంపత్ నందిని కథ తయారు చేసుకున్నాడు.

Also Read: చిన్న జీయ‌ర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు త‌ప్ప‌వా?

Tags