Nagarjuna: నాగార్జున ఆల్ టైం ఫేవరెట్ హీరేవరో తెలుసా..?

మోహన్ లాల్ సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని పనులు ఉన్నా నాగార్జున మాత్రం ఆ సినిమాను మొదటి రోజు మొదటి షో చూసేస్తారట. ఇక మోహన్ లాల్ కి 'కంప్లీట్ యాక్టర్' అనే బిరుదున్న విషయం కూడా మనకు తెలిసిందే.

Written By: Gopi, Updated On : February 28, 2024 6:05 pm
Follow us on

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాలు తీస్తూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్నప్పటికీ వాళ్లకి సైతం కొన్ని ఇష్టాలు, ఇష్టమైన హీరోలు ఉంటారు. ఇక నాగేశ్వర రావు కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున రెండోవ తరం హీరోగా స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన మంచి సినిమాలను చేయడానికి చాలా కసరత్తులనైతే చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది యంగ్ డైరెక్టర్లతో సినిమాల చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళ కథలను వింటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామి రంగ సినిమా ఫ్లాప్ అవడంతో స్క్రిప్ట్ విషయంలో కొంచెం కేర్ ఫుల్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున కి వాళ్ళ నాన్న కాకుండా ఫేవరెట్ హీరో మరొకరు ఉన్నారట. ఆయన ఎవరు అంటే మలయాళ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న మోహన్ లాల్… అవును మోహన్ లాల్ అంటే నాగార్జునకి అమితమైన ఇష్టమంట. ఆయన యాక్టింగ్ అయిన, ఆయన చేసిన సినిమాలు అయిన నాగార్జునకి చాలా నచ్చుతాయట.

మోహన్ లాల్ సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని పనులు ఉన్నా నాగార్జున మాత్రం ఆ సినిమాను మొదటి రోజు మొదటి షో చూసేస్తారట. ఇక మోహన్ లాల్ కి ‘కంప్లీట్ యాక్టర్’ అనే బిరుదున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఒక పాత్రలో ఆయన కనక నటించినట్లైతే ఆ పాత్రను ఆయన తప్ప మరెవరు అంత బాగా చేయలేరు అనేంతలా చేసి మెప్పించగల కెపాసిటీ ఉన్న హీరో మోహన్ లాల్ కావడం విశేషం. ఇక మోహన్ లాల్ తెలుగులో ఎన్టీయార్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో నటించి మెప్పించాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. దాంతో డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేయమని మోహన్ లాల్ కి చాలామంది తెలుగు దర్శకులు కథలు చెప్పినప్పటికీ ఆయన తెలుగు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట…