Mohan Babu: కన్నప్ప సినిమాలో మోహన్ బాబు పాత్ర ఏంటో తెలుసా..?

ఆయన ఇప్పుడు భారీ సక్సెస్ ను కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు చాలా రిస్క్ చేసి 150 కోట్ల బడ్జెట్ తో భక్తకన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Written By: Gopi, Updated On : March 7, 2024 11:54 am

Mohan Babu role in Kannappa movie

Follow us on

Mohan Babu: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నట వారుసలందరు వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ లను అందుకుంటుంటే మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చిన విష్ణు(Manchu Vishnu) మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నాడు. ఇక ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకి ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేదనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లు కొడ్డుతుంటే మంచు విష్ణు మాత్రం ఒక్క సక్సెస్ కూడా సాధించలేకపోవడం గమనార్హం.

దాంతో ఆయన ఇప్పుడు భారీ సక్సెస్ ను కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు చాలా రిస్క్ చేసి 150 కోట్ల బడ్జెట్ తో భక్తకన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే స్టార్ హీరోలందరిని ఏకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అందులో ముఖ్యంగా ప్రభాస్, రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి హీరోలను ఏకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్ర లో నటిస్తున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో మోహన్ బాబు కూడా నటిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే విష్ణు చేసే కన్నప్ప క్యారెక్టర్ కి గురువు పాత్రలో మోహన్ బాబు నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఇంతమంది స్టార్లను పెట్టుకొని మంచు విష్ణు ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది..

ఇక ఈ సినిమాతో కనక మంచు విష్ణు భారీ సక్సెస్ ని కొడితే తను కూడా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందుతాడు. లేకపోతే ఆయన ఇండస్ట్రీలో ఇక హీరోగా కొనసాగడం కష్టం అనే చెప్పాలి..ఇక ఇది ఇలా ఉంటే మోహన్ బాబు మరో కొడుకు అయిన మనోజ్ కూడా ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు.ఇక పర్సనల్ కారణాల వల్ల ఆయన కొన్ని సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు…